సంజ‌న ఖాతాల్లో డ‌బ్బు మాయం?

సంజ‌న ఖాతాల్లో డ‌బ్బు మాయం?
సంజ‌న ఖాతాల్లో డ‌బ్బు మాయం?

బాలీవుడ్‌లో సుశాంత్ మృతి త‌రువాత రియా కార‌ణంగా వెలుగులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో నార్కోటిక్స్ డ్ర‌గ్‌ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రియా త‌రువాత వ‌రుస‌గా హీరోయిన్‌ల పేర్లకు డ్ర‌గ్‌కు సంబంధం వుంద‌ని తేల‌డం బాలీవుడ్‌లో క‌ల‌క‌లంగా మారింది. ఇదిలా వుంటే డ్ర‌గ్ ప్ర‌కంన‌న‌లు సాండ‌ల్ వుడ్‌లోనూ మొద‌ల‌య్యాయి. ఈ కేసులో హీరోయిన్‌లు రాగిణి దివ్వేది, సంజ‌న అరెస్ట్ కావ‌డం క‌న్న‌డ ఇండ‌ప్ట్రీలో సంచ‌ల‌నం సృష్టించింది.

తాజాగా వీరి ఫోన్‌ల‌ని సీజ్ చేసిన ఎన్సీబీ అధికారుల‌కు ఆ ఫోన్‌ల‌లో కొంత మంది హీరోయిన్‌ల వ‌ల్గ‌ర్ వీడియోలు ల‌భించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చాలా మంది తార‌ల‌తో సంజ‌ర‌, రాగిన ఇదివ్వేది వ్య‌భిచారం న‌డిపించార‌ని తేల‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు. అసాంఘిక కార్య‌క‌లాపాల ద్వారానే భారీగా ఆస్తుల్ని పోగేసిన‌ట్టు విచార‌ణ‌లో సంజ‌న అంగీక‌రించిన‌ట్టు తెలిసింది.

దీంతో రంగంలోకి దిగిన ఈడీ విస్మ‌యానికి గురైన‌ట్టు తెలిసింది. సంజ‌న భారీగా ఆస్తుల్ని కూడ‌బెట్టింద‌ని విచార‌ణ చేప‌ట్టిన ఈడీకి ఆమె కాతాల్లో డ‌బ్బంతా ఖాలీ అయిన‌ట్టు తెలిసింద‌ట‌. ఇన్ని కోట్ల డ‌బ్బంతా ఎక్క‌డికి వెళ్లింది? ఏమైంది అన్న‌ది మిస్ట‌రీగా మారిన‌ట్టు చెబుతున్నారు. 11 కొండు బ్యాంకు ఖాతాల్ని మెయింటైన్ చేసిన సంజ‌న అకౌంట్‌ల‌లో 40 ల‌క్ష‌లు మాత్ర‌మే వుండ‌టం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంద‌ట‌. విష‌యం తెలిసి నాలుగు వారాల క్రిత‌మే సంజ‌న ఖాతాల నుంచి సొమ్మంతా ఇత‌ర ఖాతాల్లోకి వెళ్లిన‌ట్టు తెలిసింది.