క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి బ‌యోపిక్ డైరెక్ట‌ర్ ఫిక్స్‌!


Sanjana reddy to direct karanam malleswari bio pic
Sanjana reddy to direct karanam malleswari bio pic

ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో తొలి బ‌యోపిక్ `మ‌హాన‌టి` స‌క్సెస్ కావ‌డంతో అంతా బ‌యోపిక్‌ల‌పై ఆస‌క్తి  చూపించ‌బం మొదలుపెట్టారు. తాజాగా మ‌రో బ‌యోపిక్ తెర‌పైకి రాబోతోంది. అయితే ఈ ద‌ఫా సినిమా వాళ్ల బ‌యోపిక్ కాకుండా ఓ స్పోర్ట్స్ ప‌ర్స‌న్ బ‌యోపిక్‌ని తెర‌కెక్కించ‌బోతున్నారు. అదే వెయిట్ లిప్ట‌ర్ క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి.

2000 సంవ‌త్సరంలో జ‌రిగిన ఓలిపిక్స్ గేమ్స్‌లో భార‌త్‌కు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ప‌తాకాన్ని అందించిన తొలి మ‌హిళా క్రీడాకారిని క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి. ఆమె జీవిత క‌థ ఆధారంగా తెలుగులో ఓ బ‌యెపికిని కోన వెంక‌ట్ నిర్మించ‌బోతున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని సంజ‌నరెడ్డి డైరెక్ట్ చేయ‌నుంద‌ని తెలిసింది.

ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి పాత్రలో ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది ఇంకా తెలియాల్సి వుంది. ఈ చిత్రాన్ని కోన వెంక‌ట్‌, ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించ‌నుంద‌ని, దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే కోన వెంక‌ట్ వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది.