క్యాన్స‌ర్‌ని జ‌యించిన మున్నాభాయ్‌!


క్యాన్స‌ర్‌ని జ‌యించిన మున్నాభాయ్‌!
క్యాన్స‌ర్‌ని జ‌యించిన మున్నాభాయ్‌!

క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కోలుకున్నారు. ఆగస్టులో సంజయ్ క్యాన్స్ కార‌ణంగా విరామం తీసుకున్న విష‌యం తెలిసిందే. సంజ‌య్ ఊపిరి తిత్తుల క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల నేప‌థ్యంలో కీమో థెర‌పి ట్రీట్‌మెంట్ కోసం హాస్పిట‌ల్‌లో చేరిన సంజ‌య్ వారం త‌రువాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో  తన తలపై మచ్చను చూపించాడు. త‌ను త్వరలో క్యాన్సర్ నుండి బయటపడతాన‌ని న‌మ్మ‌కంగా చెప్పాడు.

ఈ మధ్యాహ్నం సంజయ్ దత్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా సంజయ్ త‌న పిల్లలలో ఒకరి పుట్టినరోజు కావడంతో తను క్యాన్సర్ నుండి కోలుకున్నట్టు వెల్ల‌డించారు. `గత కొన్ని వారాలు నాకు,  నా కుటుంబానికి చాలా కష్టమైన సమయం. కొంత మంది చెప్పినట్లుగా దేవుడు బలమైన సైనికులకే అత్యంత క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్ని క‌ల్పిస్తాడు. ఈ రోజు  నా కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈ యుద్ధం నుండి విజయం సాధించినందుకు నేను సంతోషంగా ఉన్నాను.  క్యాన్స‌ర్ ను జ‌యించి వారికి నేను  ఉత్తమ బహుమతిని ఇవ్వగలిగాను`అని అన్నారు సంజ‌య్‌.

`మీ అందరి అచంచలమైన విశ్వాసం, మద్దతు లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదు. ఈ ప్రయత్న సమయంలో నా కుటుంబానికి, స్నేహితులకు మరియు నాకు అండగా నిలిచిన అభిమానులందరికీ నేను నిత్యం కృతజ్ఞుడనై వుంటాను` అని పేర్కొన్నారు సంజ‌య్‌ద‌త్‌. తనకు చికిత్స చేసిన కోకిలాబెన్ ఆసుపత్రిలోని వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బందికి ఈ సంద‌ర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.