సంజీవని రివ్యూ


sanjeevani telugu movie review

సంజీవని రివ్యూ :
నటీనటులు : మనోజ్ చంద్ర , అనురాగ్ దేవ్ , శ్వేతా వర్మ
సంగీతం : శ్రవణ్
నిర్మాత : నివాస్
దర్శకత్వం : రవి
రేటింగ్ : 3 / 5

 

అంతా కొత్తవాళ్లతో రవి వీడే దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” సంజీవని ”. గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన అడ్వెంచరస్ మూవీ ఈ సంజీవని . దాదాపు రెండేళ్ల పాటు కథ ని సిద్ధం చేసుకొని తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సంజీవని ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన బృందానికి సంజీవని పర్వతం ఎక్కితే 5 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామని ఆఫర్ వస్తుంది . సంజీవని పర్వతం ఎక్కి తిరిగి వచ్చిన వాళ్ళు లేరు అయినప్పటికీ ధైర్యం చేసి ముందడుగు వేస్తారు . సంజీవని పర్వతం ఎక్కితే తిరిగి రారని ఓ సాధువు హెచ్చరించినప్పటికీ అక్కడి రహస్యాలను తెలుసుకోవాలనే ఉత్సాహంతో సంజీవని పర్వత ప్రయాణం చేస్తారు . అయితే ఆ ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? చివరకు ఆ టాస్క్ కంప్లీట్ చేసారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

గ్రాఫిక్స్
స్క్రీన్ ప్లే

సాంకేతిక వర్గం :

దర్శకుడు రవి వీడే ని అభినందించాలి , తక్కువ బడ్జెట్ లోనే మంచి క్వాలిటీ చిత్రాన్ని అందించాడు అది కూడా గ్రాఫిక్స్ హైలెట్ గా రూపొందించడం మామూలు విషయం కాదు . సంజీవని పర్వతం నేపథ్యంలో రాసుకున్న కథనం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . తాను రాసుకున్న పాత్రలకు అనుగుణంగా నటీనటులను ఎంచుకొని వాళ్ళ నుండి సరైన నటన ని రాబట్టుకున్నాడు . అలాగే విజువల్ వండర్ లా రావడానికి ఛాయాగ్రహణం కూడా అదనపు ఆకర్షణ అయ్యింది . సాంకేతిక వర్గం లోని పలువురు రాణించారు కాబట్టే అందరి కృషి కి తగ్గట్లుగా బాగుంది . నిర్మాణ విలువలు బాగున్నాయి .

విశ్లేషణ :

విభిన్న కథా చిత్రాలు కోరుకునే వాళ్లకు సంజీవని మంచి ఛాయిస్