ప్ర‌భాస్ హీరోయిన్‌కు పీడ‌క‌ల‌లు!

ప్ర‌భాస్ హీరోయిన్‌కు పీడ‌క‌ల‌లు!
ప్ర‌భాస్ హీరోయిన్‌కు పీడ‌క‌ల‌లు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం `బుజ్జిగాడు`. ఈ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది శాండ‌ల్‌వుడ్ బ్యూటీ సంజ‌నా గ‌ల్రానీ. ఈ మూవీ త‌రువాత న‌టిగా గుర్తింపుని తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది. కానీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌`లో న‌టించినా సంజ‌న‌కు ఫ‌లితం లేకుండా పోయింది.

ఇటీవ‌ల శాండ‌ల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ వివాదంలో సెక్సీ న‌టి రాగిణి దివ్వేదితో పాటు సంజ‌నా గ‌ల్రానీ కూడా ఇరుక్కుంది. ఆ త‌రువాత పోలీసులు డ్ర‌గ్స్ కేసులో సంజ‌న‌ని అరెస్ట్ చేశారు. విచార‌ణ అనంత‌రం క‌ర్ణాట‌క‌లోకి ప‌ర‌ప్ప‌ణ అగ్ర‌హార జైలుకు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి పంపించారు. అప్ప‌టి నుంచి బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు చేసిన సంజ‌న నెల రోజుల మించి జ్యుడీషియ‌ల్ కస్ట‌డీ నుంచి విముక్తి పొందింది.

ప్ర‌స్తుతం బెంవ‌గ‌ళూరులోని త‌న నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నసంజ‌న తాజాగా సోష్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసిన లేఖ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. గ‌త కొంత కాలంగా ప్ర‌శాంతంగా నిద్ర‌పోలేక‌పోతున్నాన‌ని, త‌న‌ని ప‌డ‌క‌ల‌లు వెంటాడుతున్నాయ‌ని, రెండు గంట‌ల‌కు మించి నిద్ర‌పోలేక‌పోతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న చేతుల్లో ఏమీ లేద‌ని, అంతా ఆ దేవుడికే వ‌దిలేశాన‌ని వైరాగ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది.