సంజు 3 రోజుల కలెక్షన్లు


sanju 3 days world wide collectionsరణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన సంజయ్ దత్ బయోపిక్ ” సంజు ” 3 రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టిస్తోంది . 2018 లో భారీ ఓపెనింగ్స్ ని సాధించిన అతిపెద్ద చిత్రంగా నిలిచింది సంజు . రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన సంజు చిత్రం జూన్ 29న విడుదల కాగా ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా రాబట్టింది . మొదటి రోజున 34. 75 కోట్ల వసూళ్ల ని రాబట్టగా రెండో రోజున అంతకుమించిన వసూళ్ల తో 38. 60 కోట్లు , మూడో రోజున వీకెండ్ కావడంతో అసాధారణ స్థాయిలో 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మూడు రోజుల్లోనే 113 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది సంజు .

బాలీవుడ్ లో బయోపిక్ లకు బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుండటంతో సంజు కూడా అదే జోరు ని కొనసాగిస్తోంది . సంజు చిత్రానికి ఆదరణ అంతకంతకు పెరిగి పోతుండటంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా రణ్ బీర్ కపూర్ కుటుంబం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతకొంత కాలంగా ఈ హీరోకు సరైన హిట్ లేకుండా పోయింది . కెరీర్ పరంగా ఎలాగో అలా నెట్టుకుంటూ వస్తున్నాడు కానీ సక్సెస్ మాత్రం అందని ద్రాక్షే అయ్యింది . కట్ చేస్తే ఇన్నాళ్లకు సంజు రూపంలో బ్లాక్ బస్టర్ కొట్టేసాడు . ఇక నటన పరంగా కూడా బ్రహ్మాండమైన రివ్యూస్ వచ్చాయి , ప్రేక్షకులు కూడా రణ్ బీర్ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు . మూడు రోజుల్లో 113 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో మొదటి వారంలోనే 150 కోట్లకు పైగా వసూల్ కావడం ఖాయమని భావిస్తున్నారు .

English Title: sanju 3 days world wide collections