500 కోట్ల క్లబ్ లో సంజు


sanju joins 500 crores clubసంజు అనే బాలీవుడ్ చిత్రం 500 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది . రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు . సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . రెండు వారాలు పూర్తయ్యే సరికి సంజు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల ని సాధించడంతో ఈ చిత్రం మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . భారత్ లో 378 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా ఓవర్ సీస్ లో 122 కోట్లు వసూల్ అయ్యాయి దాంతో 500 కోట్లకు పైగా వసూల్ అయినట్లయింది .

సంజయ్ దత్ జీవితంలోని పలు కోణాలను తెరమీద ఆవిష్కరించిన తీరుకి ప్రశంసలు లభిస్తున్నాయి . ముఖ్యంగా రణ్ బీర్ కపూర్ నట జీవితంలో సంజు చిత్రం ఓ మైలురాయిగా నిలిచింది. రణ్ బీర్ నటన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వ ప్రతిభ వెరసి సంజు క్లాసిక్ గా మిగిలిపోయింది . ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల వసూళ్ల ని సాధించడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . అనుకున్న దానికంటే బాగా వసూళ్లు రావడంతో షాక్ అవుతున్నారు . మనీషా కోయిరాలా , దియా మీర్జా , సోనమ్ కపూర్ , అనుష్క శర్మ , పరేష్ రావెల్ లు నటించిన సంజు ఇంకా మంచి వసూళ్ల ని సాధిస్తూనే ఉంది .

English Title: sanju joins 500 crores club