సంక్రాంతి సినిమాల రన్ టైమ్ లాకైంది… ఇక సెన్సార్ కే!


సంక్రాంతి సినిమాల రన్ టైమ్ లాకైంది.. ఇక సెన్సార్ కే!
సంక్రాంతి సినిమాల రన్ టైమ్ లాకైంది.. ఇక సెన్సార్ కే!

ప్రతి సంక్రాంతికి పోటీ ఉన్నట్లుగానే ఈ సంక్రాంతికి కూడా ప్రధానంగా రెండు సినిమాలపై అటు ట్రేడ్ ఇటు ప్రేక్షకుల దృష్టి ఉంది. అవే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటిస్తోన్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే దీనికి ముందు నుండి నెక్ టు నెక్ పోటీని ఇస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్-స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఈ రెండు చిత్రాలకు దేని బాలలు దానికి ఉండడంతో ఇరు చిత్ర యూనిట్స్ కూడా విజయంపై ధీమాగా ఉన్నాయి. ట్రేడ్ అయితే ఈ రెండు సినిమాలు బాగా ఆడితేనే వర్కౌట్ అవుతుంది. ఇక వీటితో పాటు మరో స్ట్రైట్ సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా కూడా రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈ చిత్రం జనవరి 15న విడుదల కానుంది.

ఈ మూడు చిత్రాల షూటింగ్స్ పూర్తైపోయి, రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ముగించుకున్నాయి. ఫైనల్ కాపీ సిద్ధమవడంతో ఇక సెన్సార్ కు వెళ్లడమే తరువాయి. ఈ వారమే ఈ మూడు చిత్రాల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిపోతాయ్. ఈ సందర్భంగా ఈ మూడు చిత్రాల రన్ టైమ్స్ ఎంతో బయటకు వచ్చాయి. ఏ సినిమాకైనా రన్ టైమ్ అనేది కీలకం కాబట్టి వీటికి ప్రాధాన్యత పెరిగింది. ముందుగా సరిలేరు నీకెవ్వరు రన్ టైమ్ చూసుకుంటే అది 2 గంటల 48 నిమిషాలుగా తేలింది. అనిల్ రావిపూడి గత చిత్రం ఎఫ్ 2కు కూడా దాదాపు ఇదే రన్ టైమ్ ఉండడం విశేషం. అనిల్ రావిపూడి సరిలేరు కథకు ఈ మాత్రం రన్ టైమ్ ఉండాలని భావిస్తున్నాడు.

ఇక అల వైకుంఠపురములో రన్ టైం 2 గంటల 36 నిమిషాలకు లాక్ అయింది. సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నీ 2 గంటల 30 నిమిషాలకు పైనే ఉంటాయి. అదే కోవలో అల వైకుంఠపురములో కూడా చేరింది. నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం ఎంత మంచివాడవురాకు వీటితో పోలిస్తే క్రిస్ప్ రన్ టైమ్ ఉండనుంది. 2 గంటల 22 నిమిషాలకు ఎంత మంచివాడవురా లాక్ అయింది. మరి రన్ టైమ్స్ ఈ చిత్ర విజయాలను ఏ మాత్రమైనా ప్రభావం చేయగలవా లేదా అన్నది ఈ చిత్రాలు విడుదలైతే కానీ తెలీదు.