తమిళ రీమేక్ లో నటించనున్న సంతోష్ శోభన్?

తమిళ రీమేక్ లో నటించనున్న సంతోష్ శోభన్?
తమిళ రీమేక్ లో నటించనున్న సంతోష్ శోభన్?

ఏక్ మినీ కథ సంతోష్ శోభన్ కెరీర్ ను కీలకమైన మలుపు తిప్పింది. గోల్కొండ హైస్కూల్ లో నటించిన సంతోష్ శోభన్, ఆ తర్వాత పేపర్ బాయ్ సినిమాలో నటించాడు. కానీ ఏక్ మినీ కథ ఈ హీరోకు బ్రేక్ ను ఇచ్చింది. ప్రస్తుతం వరస అవకాశాలను అందుకుంటున్నాడు ఈ యువ హీరో.

ఇప్పటికే కొత్త దర్శకుడు అభిషేక్ మహర్షితో ప్రేమ్ కుమార్ చిత్రాన్ని చేస్తోన్న సంతోష్ శోభన్, మారుతి దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ ను కూడా చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఒక తమిళ రీమేక్ లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ దర్శకుడు శ్రీ గణేష్ సంతోష్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు. 8 తోట్టకల్ చిత్రాన్ని ఈ యువ హీరోతో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు.

అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది. మరింత క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతుంది.