సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మహానటుడు ఎన్టీఆర్ నటించిన `గజదొంగ`కూ, దీనికీ సంబంధం లేదు. ఇందులో సప్తగిరిది దొంగలకు దొంగలాంటి పాత్ర. అసలు సిసలు దొంగల్ని దోచుకుని సమాజానికి ఉపయోగపడే దొంగగా కనిపించనున్నాడు. విలేజ్, టౌన్ బ్యాక్డ్రాప్లో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఆగస్టు తొలి వారంలో చిత్రీకరణ మొదలుపెడతాం“ అని తెలిపారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రవీణ్ వనమాలి, సంగీతం:బుల్గానిన్, ఆర్ట్ : వర్మ,మూల కథ-రచనా సహకారం: G.T.R. మహేంద్ర, P.V.సతీష్, లైన్ ప్రొడ్యూసర్:R.V.V.V.ప్రసాద్, నిర్మాతలు: శర్మ చుక్కా, యెడల నరేంద్ర ,G .V .N .రెడ్డి , కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: డి.రామకృష్ణ.