శ‌ర‌త్‌కుమార్, రాధిక‌ల‌కు ఏడాది జైలు శిక్ష‌!

శ‌ర‌త్‌కుమార్, రాధిక‌ల‌కు ఏడాది జైలు శిక్ష‌!
శ‌ర‌త్‌కుమార్, రాధిక‌ల‌కు ఏడాది జైలు శిక్ష‌!

కోలీవుడ్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్‌, ఆయ‌న భార్య‌, న‌టి రాధిక‌కు చెన్నైలోని పైదా పేట కోర్టు ఏడాది శిక్ష విధిస్తూ బుధ‌వారం తీర్పుని వెలువ‌రించింది. 2017 నాటి చెక్ బౌన్స్ కేసులో శ‌ర‌త్‌కుమార్‌, రాధిక‌లకు ఈ శిక్ష ప‌డింది. వివ‌రాల్లోకి వెళితే…శ‌ర‌త్‌కుమార్, రాధిక, లిస్ట‌న్ స్టీఫెన్‌తో క‌లిసి గ‌తంలో సంయుక్తంగా సినిమాలు నిర్మించారు.

ఆ క్ర‌మంలో రేడియ‌న్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌లో పెద్ద మొత్తంలో డ‌బ్బు అప్పు చేశారు. అయితే తీసుకున్న అప్పు చెల్లించ‌డం కోసం 2017లో రేడియ‌న్స్ సంస్థ‌కు చెక్ అంద‌జేశార‌ట‌. అలా ఇచ్చిన చెక్ బౌన్స్ కావ‌డంతో స‌ద‌రు రేడియ‌న్స్ సంస్థ కోర్టుని ఆశ్ర‌యించింది. 2019లో ఈ కేసు విచార‌ణ స‌మ‌యంలోరాధిక‌, శ‌ర‌త్‌కుమార్ దంపతులపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ కావ‌డం అప్ప‌ట్లో త‌మిళ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజాగా ఈ కేసును విచారించిన సైదాపేట కోర్టు రాధిక‌, శ‌ర‌త్‌కుమార్ దంప‌తుల‌కు ఏడాది శిక్ష‌ని విధిస్తూ తీర్పునివ్వ‌డం సంల‌చ‌నంగా మారింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో శ‌ర‌త్‌కుమార్‌, రాధిక దంప‌తులు జంట‌గా వెళ్లి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుని అనంత‌రం ఫొటోల‌కు పోజులిచ్చిన విష‌యం తెలిసిందే.