నాన్నకు హైద‌రాబాద్‌లోనే చికిత్స జ‌రుగుతోంది!

నాన్నకు హైద‌రాబాద్‌లోనే చికిత్స జ‌రుగుతోంది!
నాన్నకు హైద‌రాబాద్‌లోనే చికిత్స జ‌రుగుతోంది!

దేశంలో క‌రోనా అంటే భ‌యం పోయింది.. నానాటికీ కేసులు పెరుగుతున్నా జ‌నాల్లో మాత్రం అవ‌గాహ‌న పెర‌గ‌డం లేదు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా ఇప్ప‌టికీ చాలా మంది క‌రోనా బారిన ప‌డుతూనే వున్నారు. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. సినీ వ‌ర్గాల్లో కూడా దీని బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.

తాజాగా త‌మిళ న‌టుడు శ‌ర‌త్‌కుమార్ కు క‌రోనా పాజిటివ్ అని తేలిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ‌ర‌త్‌కుమార్ కూతురు, హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. క‌రోనా ల‌క్ష‌ణాలు లేకుండానే శ‌ర‌త్‌కుమార్‌కు పాజిటివ్ అని తేలిసింద‌ని తెలిపారు. `నాన్న‌కు పాజిటివ్ అని ఈ రోజు తెలిసింది. ప్ర‌స్తుతం నాన్న హైద‌రాబాద్‌లోనే వున్నారు. ఇక్క‌డే ఆయ‌న‌కు చికిత్స జ‌రుగుతోంది. మంచి వ్య‌క్తులు ఆయ‌న‌కు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన వివ‌రాల్ని మీకు అందిస్తూనే వుంటారు` అని వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ట్వీట్ చేసింది.

అంటే శ‌ర‌త్‌కుమార్ హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌న్న‌మాట‌. ఇదిలా వుంటే మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వ‌న్‌` చిత్రంలో శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.