హైదరాబాద్ లో ఫైట్ చేస్తున్న మహేష్


హైదరాబాద్ లో ఫైట్ చేస్తున్న మహేష్
హైదరాబాద్ లో ఫైట్ చేస్తున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషించారు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటించనున్న ఈ చిత్రంలో కర్నూల్ ఫ్యాక్షన్ ప్రస్తావన కూడా ఉంది. ఇటీవలే కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ వేసి కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకరాలలో జరుగుతోంది. ఇక్కడ రెండున్నర కోట్ల రూపాయల ఖర్చుతో ఒక ఇంటి సెట్ ను వేసారట. ప్రకాష్ రాజ్ కు సంబంధించిన ఈ ఇంట్లో ప్రస్తుతం ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది.

మహేష్ తో పాటు కీలక నటీనటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. నవంబర్ నెలాఖరు కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలనే డెడ్ లైన్ తో యూనిట్ పనిచేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ డిసెంబర్ లోనే పూర్తి చేసి సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నారు.