సరిలేరు నీకెవ్వరు 10 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్: 100 కోట్ల క్లబ్ లోకి మహేష్


Sarileru Neekevvaru 10 days collections report
Sarileru Neekevvaru 10 days collections report

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు డీసెంట్ ఓపెనింగ్స్ తో ప్రారంభమై అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. మొదటి వారానికే దాదాపు 84 కోట్ల షేర్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గా నిలిచింది. ఇక ఫస్ట్ వీక్ తర్వాత కూడా సరిలేరు నీకెవ్వరు ఫామ్ కొనసాగించింది. నిన్న వర్కింగ్ డే అయినా కూడా సరిలేరు నీకెవ్వరు దాదాపు 3 కోట్ల పైన షేర్ సాధించింది. దీంతో టోటల్ 100 కోట్ల గోల్డెన్ మార్క్ ను దాటింది.

సరిలేరు నీకెవ్వరు ఈ మార్క్ ను అందుకున్న నాలుగో చిత్రంగా నిలిచింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ మార్క్ ను అందుకోవడం అంటే మాములు విషయం కాదు. వరల్డ్ వైడ్ దాదాపు 103 కోట్ల బిజినెస్ చేసిన సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 124 కోట్లపైన వసూలు చేసింది. మహేష్ బాబు కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిందీ చిత్రం.

ఇప్పటి వరకూ బాహుబలి2(198.7 కోట్లు), బాహుబలి(110.1 కోట్లు), సైరా (104.9 కోట్లు) ఈ ఫీట్ ను సాధించాయి. మరి సరిలేరు నీకెవ్వరు ఫుల్ రన్ లో ఎంత వరకూ వసూలు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

నైజాం : 32.9 కోట్లు
సీడెడ్ : 14.1 కోట్లు
గుంటూరు : 9.05 కోట్లు
ఉత్తరాంధ్ర : 16.62 కోట్లు
తూర్పు గోదావరి : 10.05 కోట్లు
పశ్చిమ గోదావరి : 6.57 కోట్లు
కృష్ణ : 7.97 కోట్లు
నెల్లూరు : 3.65 కోట్లు

10 రోజుల మొత్తం షేర్ : 100.91 కోట్లు

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించగా విజయశాంతి కీలక పాత్రలో నటించారు. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.