సరిలేరు నీకెవ్వరు 12 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


సరిలేరు నీకెవ్వరు 12 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
సరిలేరు నీకెవ్వరు 12 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సెలవులు ముగిసినా కానీ తన హవా చూపిస్తోంది. సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా ఇంకా డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తోంది. 3 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం, మంగళ, బుధవారాల్లో చెరో 2 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో 12 రోజుల సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ షేర్ 104 కోట్ల మార్క్ ను దాటింది. దీంతో చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన సైరా కలెక్షన్స్ ను దాటినట్లయింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బాహుబలి 1 కలెక్షన్స్ 110 కోట్ల దగ్గర ఉంది. మరి సరిలేరు ఆ మార్క్ ను దాటగలదో లేదో చూడాలి.

సరిలేరు నీకెవ్వరు 12 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :

నైజాం : 34.26 కోట్లు
సీడెడ్ : 14.53 కోట్లు
గుంటూరు : 9.2 కోట్లు
ఉత్తరాంధ్ర : 17.44 కోట్లు
తూర్పు గోదావరి : 10.36 కోట్లు
పశ్చిమ గోదావరి : 6.8 కోట్లు
కృష్ణా : 8.18 కోట్లు
నెల్లూరు : 3.78 కోట్లు

12 రోజుల మొత్తం షేర్ : 104.55 కోట్లు

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించగా, విజయశాంతి కీలక పాత్రలో కనిపించింది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. మహేష్ బాబు ఈ చిత్రంలో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటించారు.