సరిలేరు నీకెవ్వరు 15 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


సరిలేరు నీకెవ్వరు 15 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
సరిలేరు నీకెవ్వరు 15 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెల్సిందే. ఈ సినిమా సాధించిన వసూళ్లు మహేష్ కెరీర్ లో హయ్యస్ట్ గా నిలిచాయి. మొదటి నుండి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన ఈ చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఫస్ట్ వీక్ లోనే ప్రాఫిట్స్ లోకి చేరిన ఈ చిత్రం సెకండ్ వీక్ లో కొంచెం డల్ అయింది. అయితే మళ్ళీ వీకెండ్ వచ్చేసరికి కలెక్షన్స్ లో కొంచెం పెరుగుదల కనిపించింది. కలెక్షన్స్ పెంచడానికి ఆఖరి మార్గంగా సినిమాలో కొత్త సీన్లను యాడ్ చేసిన విషయం తెల్సిందే. శనివారం నుండి కొత్త సీన్స్ తో సినిమా ప్లే అవుతోంది.

ఇక సరిలేరు నీకెవ్వరు రెండు తెలుగు రాష్ట్రాల నుండి 100 కోట్ల షేర్ ను క్రాస్ చేసి ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్ లో నాలుగో స్థానంలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా కలెక్షన్స్ ను బ్రేక్ చేసిందీ చిత్రం. 15 రోజులకు గాను సరిలేరు నీకెవ్వరు 107 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. శనివారం ఈ చిత్రం 1.15 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈరోజు ఆదివారం కావడంతో మరో కోటి పైన షేర్ రావడం ఖాయం. మొత్తంగా సరిలేరు నీకెవ్వరు 110 కోట్ల మార్క్ ను దాటనుంది.

సరిలేరు నీకెవ్వరు 15 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

నైజాం : 35.40 కోట్లు
సీడెడ్ : 14.89 కోట్లు
గుంటూరు : 9.36 కోట్లు
ఉత్తరాంధ్ర : 18.25 కోట్లు
తూర్పు గోదావరి : 10.69 కోట్లు
పశ్చిమ గోదావరి : 7.02 కోట్లు
కృష్ణ : 8.36 కోట్లు
నెల్లూరు : 3.89 కోట్లు

15 రోజుల మొత్తం షేర్ : 107.86 కోట్లు