సరిలేరు నీకెవ్వరు 16 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్Sarileru Neekevvaru 16 days box office collections report
Sarileru Neekevvaru 16 days box office collections report

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హల్చల్ సృష్టించిన సంగతి తెల్సిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది. ఈ చిత్రానికి మొదట యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. అయితే మహేష్ ఛరిస్మా, సంక్రాంతి సీజన్ కలగలిసి సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించిన వసూళ్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా 100 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అయితే సెకండ్ వీక్ ముగిసాక ఈ సినిమా కొంచెం స్లో అయినట్లు కనిపించింది కానీ వీకెండ్ వచ్చేసరికి మళ్ళీ పుంజుకుంది. ఈ సినిమా నిన్న ఏకంగా 2.5 కోట్లకు పైనే రెండు రాష్ట్రాల్లో షేర్ ను నమోదు చేయడం విశేషం.

మొత్తం 16 రోజులకు కలిపి చూసుకుంటే 109 కోట్లకు పైన వసూళ్లతో బాహుబలి 1 కలెక్షన్స్ ను దాటేలా కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ఫీట్ సాధించడం ఖాయం. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు తెలుగు చిత్రాల ఆల్ టైమ్ టాప్ 4 స్థానంలో నిలవడం విశేషం.

సరిలేరు నీకెవ్వరు 16 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

నైజాం : 36.29 కోట్లు
సీడెడ్ : 15.07 కోట్లు
గుంటూరు : 9.52 కోట్లు
ఉత్తరాంధ్ర : 18.57 కోట్లు
తూర్పు గోదావరి : 10.88 కోట్లు
పశ్చిమ గోదావరి : 7.15 కోట్లు
కృష్ణ : 8.51 కోట్లు
నెల్లూరు : 3.95 కోట్లు

16 రోజుల మొత్తం షేర్ : 109.94 కోట్లు

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది.