సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్
సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఇంకా పండగ షురూ కాకుండానే దాదాపు 50 శాతం షేర్ ను రెండు తెలుగు రాష్ట్రాల నుండే వసూలు చేయడం విశేషం. తొలిరోజు 32 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిన సరిలేరు నీకెవ్వరు దాన్నుండి చాలా లాభపడిందనే చెప్పొచ్చు. అల వైకుంఠపురములో కంటే ఒకరోజు ముందు రావడం ఈ చిత్రానికి ఎంతగానో కలిసొచ్చింది. ఇక రెండో రోజు కూడా దాదాపు 9 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం, మూడో రోజైన సోమవారం కూడా స్ట్రాంగ్ గా నిలిచింది. మూడో రోజు ఈ చిత్రం 7 కోట్లకు పైగా షేర్ సాధించింది. దీంతో మూడు రోజుల సరిలేరు నీకెవ్వరు 50 కోట్ల షేర్ మార్క్ కు చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా షేర్ ను చూసుకుంటే ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ను టచ్ చేయడం విశేషం.

ఇక ఈరోజు నుండి పండగ మొదలుకావడంతో సరిలేరు నీకెవ్వరు తొలి వీక్ పూర్తయ్యేసరికి స్టన్నింగ్ నంబర్స్ నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పోటీగా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఉన్నా కానీ సరిలేరు నీకెవ్వరు సూపర్ స్ట్రాంగ్ గా దూసుకుపోతుండడం విశేషం.

మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి బి, సి సెంటర్లలో విశేషమైన నెంబర్లు నమోదవుతున్నాయి. మహేష్ కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ చిత్రం అయ్యేలా ఈ చిత్రం నిలవనుంది.

సరిలేరు నీకెవ్వరు 3 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్

నైజాం :Rs 15.95 Cr

సీడెడ్ : Rs 6.19 Cr

గుంటూరు : Rs 6.10 Cr

వైజాగ్ : Rs 6.58 Cr

ఈస్ట్ : Rs 4.53 Cr

వెస్ట్ : Rs 3.52 Cr

నెల్లూరు : Rs 1.78 Cr

కృష్ణ : Rs 4.22 Cr

ఆంధ్ర + తెలంగాణ : 48.87 Cr