సరిలేరు నీకెవ్వరు 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


Sarileru Neekevvaru 5days Collections
Sarileru Neekevvaru 5days Collections

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం సంక్రాంతి అడ్వాంటేజ్ ను ఫుల్లుగా ఉపయోగించుకుంటోంది. మొదటి రోజే 32 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఒక ఊపు ఊపిన ఈ చిత్రం రెండో రోజు, మూడో రోజు కొంచెం తగ్గినట్లు అనిపించినా భోగి రోజున తిరిగి పుంజుకుంది. ఇక నిన్న సంక్రాంతి సందర్భంగా వసూళ్లు పీక్స్ లో నడిచాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రస్తుతం భారీ డిమాండ్ నడుస్తోంది. చాలా చోట్ల టిక్కెట్లు దొరక్క ప్రేక్షకులు నిరుత్సాహంగా వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు.

రెండో రోజు 9.5 కోట్ల షేర్ సాధించి, మూడవ రోజు 7.21 కోట్ల షేర్ సాధించి 50 కోట్ల షేర్ మార్క్ కి చేరువైన సరిలేరు నీకెవ్వరు, భోగి అయిన నాలుగో రోజున 9 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం మళ్ళీ సంక్రాంతి నాటికి ఇంకా ఫుల్ ఫామ్ లోకి వచ్చి దాదాపు 10 కోట్ల షేర్ ను నమోదు చేసింది. దీంతో 5 రోజుల సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ 68.22 కోట్లకు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 75 కోట్ల ప్రీ రిలీజ్.  అంటే ఈరోజుకి అన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకోనుంది. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ సినిమా డబ్బు పెట్టిన ప్రతిఒక్కరికీ నిజంగా పండగని తీసుకొచ్చింది.

ఈరోజు కూడా కనుమ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు అదే స్థాయిలో పెర్ఫార్మ్ చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ ఫుల్స్ చాలా చోట్ల నమోదవడంతో ఈరోజు షేర్ కూడా 9 కోట్లకు ఇటూ ఇటూగా ఉండనుంది. ఇక ఓవర్సీస్ లో కూడా సరిలేరు బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. 1.8 మిలియన్ డాలర్స్ కు చేరువైన ఈ చిత్రం త్వరలో 2 మిలియన్ మార్క్ ను చేరుకుంటుంది.

నైజాం: 22.5 కోట్లు
సీడెడ్: 9.75 కోట్లు
గుంటూరు: 7.19 కోట్లు
ఉత్తరాంధ్ర: 10.05 కోట్లు
తూర్పు గోదావరి: 6.22 కోట్లు
పశ్చిమ గోదావరి: 4.54 కోట్లు
కృష్ణా: 5.55 కోట్లు
నెల్లూరు: 2.42 కోట్లు

ఆంధ్ర+తెలంగాణ: 68.08 కోట్లు