సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


Sarileru Neekevvaru 6 Days Collections report
Sarileru Neekevvaru 6 Days Collections report

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు తన బాక్స్ ఆఫీస్ దూకుడును కొనసాగిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి అడ్వాంటేజ్ ను ఫుల్లుగా వాడుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఏరియాలోనూ భారీ స్థాయిలో కలెక్షన్స్ ను సాధిస్తూ దూసుకుపోతోంది. ఆరు రోజులకు గాను ఈ చిత్రం ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కు సైతం చేరుకుంది. ఇంకా ఈస్ట్, కృష్ణ, నెల్లూరులో బ్రేక్ ఈవెన్ కు చేరుకోవాల్సి ఉంది. అది కూడా ఈరోజుతో పూర్తవుతుంది. అంటే ఇక మీదట ఈ చిత్రానికి వచ్చేదంతా లాభమే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నిజమైన సంక్రాంతి పండగ వచ్చినట్లైంది. మొత్తంగా చూసుకుంటే సరిలేరు నీకెవ్వరు తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కానీ ఆరు రోజు సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ షేర్ చూసుకుంటే 78 కోట్లకు చేరుకుంది. అంటే మొత్తంగా సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను దాటేసి దూసుకుపోతోంది.

తొలి ఐదు రోజుల్లో 68 కోట్ల షేర్ ను సాధించిన సరిలేరు నీకెవ్వరు ఆరో రోజు కూడా 9 కోట్ల షేర్ ను సాధించి రికార్డును సృష్టించింది. నైజాం, సీడెడ్, గుంటూరు, కృష్ణ వంటి ఏరియాల్లో నాన్ బాహుబలి 2 రికార్డులు. మిగిలిన ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డులు సొంతం చేసుకుంది ఈ చిత్రం.

సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:
నైజాం :Rs 25.65 Cr
సీడెడ్ : Rs 11.35 Cr
గుంటూరు : Rs  7.72 Cr
వైజాగ్ : Rs 11.8 Cr
ఈస్ట్ : Rs 7.23 Cr
వెస్ట్ : Rs  5.06 Cr
నెల్లూరు : Rs 2.86 Cr
కృష్ణ : Rs 6.27 Cr
ఆంధ్ర + తెలంగాణ : Rs 77.94 Cr షేర్స్

మహేష్ బాబు సరసన రష్మిక నటించిన ఈ చిత్రంలో విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.