సరిలేరు నీకెవ్వరు 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్సరిలేరు నీకెవ్వరు 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
సరిలేరు నీకెవ్వరు 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ గా అవతరించిన విషయం తెల్సిందే. జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుండి దూసుకుపోతోంది. సంక్రాంతి పండగల రోజుల్లో ఒక్క రోజు కూడా ఎక్కడా తగ్గకుండా సరిలేరు నీకెవ్వరు పెర్ఫార్మ్ చేయడం విశేషం. ఇక సంక్రాంతి సెలవులు పూర్తవ్వగానే వీకెండ్ మొదలవ్వడంతో మళ్ళీ పుంజుకుందీ చిత్రం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుండే సరిలేరు నీకెవ్వరు 100 కోట్ల షేర్ వైపు పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఈ ఏరియాల్లో ఈ చిత్రం ప్రాఫిట్స్ లోకి ఎంటరైన విషయం తెల్సిందే. సరిలేరు నీకెవ్వరు రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్లకు బిజినెస్ జరిగింది.

మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ నటనకు అభిమానులు ఫుల్ ఫిదా అయ్యారు. కామెడీ టైమింగ్, యాక్షన్, మహేష్ డ్యాన్సులు ఇలా అన్నీ ఫ్యాన్స్ కు కనువిందు చేసాయి. మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించింది.

సరిలేరు నీకెవ్వరు 8 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

నైజాం :Rs 29.64 Cr

సీడెడ్ : Rs 12.74 Cr

ఈస్ట్ గోదావరి : Rs 9.05 Cr

వెస్ట్ గోదావరి : Rs 6.01 Cr

గుంటూరు : Rs 8.52Cr

వైజాగ్ : Rs 14.05 Cr

నెల్లూరు : Rs 3.21 Cr

కృష్ణ : Rs 7.37 Cr

ఆంధ్ర + తెలంగాణ : Rs 91.04 Cr షేర్స్