సరిలేరు నీకెవ్వరు 9 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్


సరిలేరు నీకెవ్వరు 9 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
సరిలేరు నీకెవ్వరు 9 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు తన సూపర్ ఫామ్ ను నిన్న కూడా కొనసాగించింది. ఆదివారం కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. రెండో వీకెండ్ కు ఆఖరి రోజైన నిన్న సరిలేరు నీకెవ్వరు 6.58 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఈ దెబ్బతో ఈ చిత్రం 100 కోట్ల షేర్ కు అతి చేరువగా వచ్చింది. 9 రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం 97.62 కోట్ల షేర్ ను సాధించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

సరిలేరు నీకెవ్వరు రెండు తెలుగు రాష్ట్రాల్లో 75 కోట్లకు అటూ ఇటూగా బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 103 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 100 కోట్ల షేర్ రానుండడం నిజంగా విశేషమే. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

మహేష్ బాబు అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు సమర్పణలో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ కు థియేటర్లు షేకైపోతున్నాయి. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ కాగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించింది.

సరిలేరు నీకెవ్వరు 9 రోజుల కలెక్షన్స్ బ్రేక్ డౌన్:

నైజాం : 31.96 కోట్లు
సీడెడ్ : 13.59 కోట్లు
గుంటూరు : 8.89 కోట్లు
ఉత్తరాంధ్ర : 15.75 కోట్లు
తూర్పు గోదావరి : 9.76 కోట్లు
పశ్చిమ గోదావరి : 6.35 కోట్లు
కృష్ణా : 7.81 కోట్లు
నెల్లూరు : 3.52 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ : 97.62 కోట్లు