అల్లు అర్జున్, మహేష్.. ఒకరిని చూసి మరొకరు భయపడుతున్నారా?


అల్లు అర్జున్, మహేష్.. ఒకరిని చూసి మరొకరు భయపడుతున్నారా?
అల్లు అర్జున్, మహేష్.. ఒకరిని చూసి మరొకరు భయపడుతున్నారా?

అసలు సంక్రాంతి సీజన్ కు ఎందుకింత క్రేజ్? ఎందుకేముంది సంక్రాంతికి అందరికీ సినిమాలే ఎంటర్టైన్మెంట్. ఒక వారం రోజుల పాటు సినిమా కొంచెం బాగుంది అనిపించుకుంటే చాలు వసూళ్లు అదిరిపోతాయి. అందుకే తెలుగు చిత్రాలు సంక్రాంతికి ఎక్కువ మోజు చూపిస్తుంటాయి. ప్రతిసారి సంక్రాంతిని బానే క్యాష్ చేసుకుంటున్న తెలుగు ఇండస్ట్రీకి ఈసారి పెద్ద చిక్కే వచ్చి పడింది.

సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు రెండూ ఆదివారమే అంటే 12న విడుదల కానున్నాయి. నిజానికి జనవరి 10న అంటే శుక్రవారం రిలీజ్ పెట్టుకుంటే వీకెండ్ తో పాటు సంక్రాంతి సెలవులు కలిసివస్తాయి. ఇది పెర్ఫెక్ట్ రిలీజ్ అవుతుంది. అయితే సెంటిమెంట్ పేరు చెప్పి ఈ రెండు చిత్రాలూ జనవరి 10న రావట్లేదు.

పోనీ ఏదో ఒక సినిమా జనవరి 11న అయినా విడుదల కావొచ్చు. శనివారం వసూళ్లు కూడా సినిమాలకు చాలా ముఖ్యం. అటు యూఎస్ లో, ఇటు మనకి… ఎలా చూసినా శనివారం వసూళ్లను ఈ రెండు చిత్రాలు ఎందుకు వదులుకుంటున్నాయో అర్ధం కావట్లేదు. దీనికి పైకి కనిపిస్తున్న ఒకే ఒక్క కారణం.. భయం. అవును, ఒక సినిమాను చూసి మరొక సినిమా భయపడుతోందిట. తాము ముందు వచ్చి టాక్ తేడా వచ్చి, వాళ్ళ సినిమాకి టాక్ బాగా వస్తే మొదటికే మోసం వస్తుందని రెండు చిత్రాల వారూ భయపడుతున్నారట.

మరోవైపు ఎలా అయినా జనవరి 11న ఒక చిత్రాన్ని ఒప్పించడానికి తెర వెనుక మంతనాలు ఇప్పటికే మొదలయ్యాయి. మరి ఏ చిత్రం ముందుకు వెళ్తుందో చూడాలి.