అక్కడ కూడా అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరుదే హవా ఉందిగా


అక్కడ కూడా అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరుదే హవా ఉందిగా
అక్కడ కూడా అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరుదే హవా ఉందిగా

ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి ప్రతీ సంక్రాంతి సీజన్ కన్నా కూసింత ఎక్కువే ఉందని చెప్పాలి. ఈ సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి దండయాత్ర చేశాయో మనందరం చూసాం. ఈ రెండు చిత్రాలూ కూడా చెరొక 100 కోట్ల షేర్ ను తమ ఖాతాలో వేసుకున్నాయి. అల వైకుంఠపురములో చిత్రమైతే ఏకంగా నాన్ బాహుబలి రికార్డులను వేటాడేసింది. రెండు చిత్రాలు కూడా దిగ్విజయంగా 50 రోజులను పూర్తి చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో రిలీజైనా కూడా థియేటర్లలో అంతో ఇంతో సందడి చేసాయి. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతడబడడంతో ఈ చిత్రాలు ఫుల్ రన్ కు చేరుకున్నట్లే.

ప్రస్తుతం థియేటర్లు మూతబడడం, ఆఫీస్ లు ఎక్కువగా ఇంటి నుండే పనిచేసే సౌలభ్యం ఇవ్వడంతో అందరూ ఓటిటి వాడకలను పెంచేశారు. దీన్ని బట్టి తాజా విశ్లేషణలో తెలిసింది ఏంటంటే తెలుగు చిత్రాల వరకూ అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాల సందడి చాలా ఎక్కువగా ఉందట. దాదాపు లక్షల్లో వ్యూస్ రోజూ ఈ రెండు సినిమాలకు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుండగా, అల వైకుంఠపురములో సన్ నెక్స్ట్, నెట్ ఫ్లిక్స్ లలో అందుబాటులో ఉన్నాయి.

ఇప్పుడు కొత్తగా తెలుగు సినిమాల వరకూ ఓ పిట్ట కథ, రాజా వారు రాణి గారు చిత్రాలు స్ట్రీమ్ అవుతున్నాయి. వీటి మీద కూడా ప్రేక్షకులు కన్నేస్తున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్ లు అటు తెలుగులో, ఇటు ఇంగ్లీష్, హిందీలలో అందుబాటులో ఉండడంతో ప్రేక్షకులకు వినోదానికి అయితే లోటు లేకుండా పోయింది.

అయితే థియేటర్లు తెరిస్తే కానీ తెలుగు సినిమా బ్రతికే అవకాశం లేదు. అది జరగాలంటే ప్రస్తుతం పెరుగుతున్న కోవిద్ 19 కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాలి.