“బాహుబలి 2” రికార్డులను బద్దలుకొట్టిన “సరిలేరు నీకెవ్వరు”


“బాహుబలి 2” రికార్డులను బద్దలుకొట్టిన “సరిలేరు నీకెవ్వరు”
“బాహుబలి 2” రికార్డులను బద్దలుకొట్టిన “సరిలేరు నీకెవ్వరు”

అవును….! మీరు వింటున్నది నిజమే తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన పాన్ ఇండియా సినిమా “బాహుబలి 2” రికార్డులలో ఒక రికార్డును సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సంక్రాంతి హిట్ మూవీ “సరిలేరు నీకెవ్వరు” క్రాస్ చేసింది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల “సరిలేరు నీకెవ్వరు” సినిమా ఒక వైపు మరొక హిట్ సినిమా “అల వైకుంఠపురంలో…” పోటీపడి పోటీగా కలెక్షన్లను సాధించింది. కలెక్షన్లను ప్రకటించుకునే విషయంలో ఈ రెండు సినిమాల మేకర్స్ పోటీ పడ్డారు.

తాజాగా ఒక టీవీ చానల్ లో ప్రసారం అయిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా కుడివైపు ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా 23.4 శాతం టీఆర్పీని సాధించింది. టెలివిజన్ రంగంలో ఏ కార్యక్రమమైనా రియాలిటీ షో అయినా అయినా లేక ప్రసారమైన సినిమా యొక్క సక్సెస్ రేట్ ను టిఆర్పి రేటింగ్ తో కలుస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే గతంలో ఎప్పుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లో భాగంగా “బాహుబలి 2 ది కన్ క్లూజన్” సినిమా 22.70 టీఆర్పీ మొదటి స్థానంలో ఉండేది తాజాగా ఆ రికార్డును సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” సినిమా క్రాస్ చేసింది. అయితే ప్రస్తుతం వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇళ్ళల్లో ఉండే ప్రజలకు ఎలా ఉండే ఏకైక వినోద సాధనం టీవీ కాబట్టి… ఈ రికార్డు సాధ్యమైంది అని మనం అనుకోవచ్చు.