200 క్రోర్‌ క్ల‌బ్‌లోకి ఎంట‌ర‌య్యారుగా!Sarileru Neekevvaru entered 200 plus crore club
Sarileru Neekevvaru entered 200 plus crore club

మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించి సెన్సేష‌న‌ల్ ఫిల్మ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచి భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అనిపించుకుంటున్న ఈ చిత్రం ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. దిల్‌రాజుతో క‌లిసి అనిల్ సుంక‌ర నిర్మించిన ఈ సినిమా తొలి రోజు తొలి షో నుంచే అనూహ్య స్పంద‌న‌ని సొంతం చేసుకుంది. దీంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది.

13 ఏళ్ల విరామం త‌రువాత లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి న‌టించడం, మ‌హేష్ ఆర్టీ ఆఫీస‌ర్‌గా కొత్త త‌ర‌హా పాత్రని ఎంచుకోవ‌డం, సీరియ‌స్‌తో పాటు ఎంట‌ర్టైన్‌మెంట్‌ని కూడా స‌మ‌పాళ్ల‌లో పండించ‌డంతో `స‌రిలేరు నీకెవ్వ‌రు` అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్‌ని దాట‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంటే మ‌హేష్ ఫ్యాన్స్ మాత్రం సంబ‌రాలు చేసుకుంటున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం రియ‌ల్ గ్రాస్ ఇన్ వ‌ర‌ల్డ్ వైడ్ అంటూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా నిర్మాతల‌లో ఒక‌రైన అనిల్ సుంక‌ర‌ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్ర క‌లెక్ష‌న్స్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయినా `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రేక్ష‌కుల అపూర్వ ఆద‌ర‌ణ‌తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తూ మ‌హేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింద‌న్నారు. త‌మ చిత్రానికి ఇంత‌టి అనూహ్య విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు, సూప‌ర్‌స్టార్ కృష్ణ అభిమానుల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.