ఫైనల్ షెడ్యూల్ లోకి దిగిన సరిలేరు నీకెవ్వరు


ఫైనల్ షెడ్యూల్ లోకి దిగిన సరిలేరు నీకెవ్వరు
ఫైనల్ షెడ్యూల్ లోకి దిగిన సరిలేరు నీకెవ్వరు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించిన సూపర్ అప్డేట్ మహేష్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోన్న సంగతి తెల్సిందే. షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి అన్న వార్తలు వస్తున్నాయి కానీ షూటింగ్ ఎంత వరకూ జరిగింది అన్నదానిపై క్లారిటీ లేదు.

అయితే మహేష్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూ ఆ చిత్ర నిర్మాత అనిల్ సుంకర సూపర్ అప్డేట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి సంబంధించి విలన్ హౌస్ షెడ్యూల్ పూర్తయిందని, ఇక లాస్ట్ షెడ్యూల్ మాత్రం మిగిలుందని అన్నాడు. అంతే కాకుండా దీపావళి సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.

కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ తర్వాత రెండున్నర కోట్లు పెట్టి వేసిన విలన్ హౌస్ సెట్ లో కీలక సన్నివేశాలు, ఫైట్ చిత్రీకరణ జరిగింది. ఇంకా లాస్ట్ షెడ్యూల్ మాత్రమే మిగిలుంది. అయితే అది ఎప్పుడు మొదలవుతుంది అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. నవంబర్ లోనే చిత్రాన్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు సరిలేరు నీకెవ్వరు టీమ్.