సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ కలెక్షస్న్ రిపోర్ట్


సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ కలెక్షస్న్ రిపోర్ట్
సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ కలెక్షస్న్ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్న విషయం తెల్సిందే. సంక్రాంతి సెలవుల్లో భీభత్సంగా పెర్ఫార్మ్ చేసిన ఈ చిత్రం, సెలవులు అయ్యాక కూడా ఎక్కడా తగ్గలేదు. శుక్రవారం కూడా స్ట్రాంగ్ గా ఉన్న కలెక్షన్స్ ఇక వీకెండ్ కావడంతో ఈరోజు, రేపు కూడా బాగా పెర్ఫార్మ్ చేయనుంది. నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 84 కోట్ల షేర్ ను వసూలు చేసింది. మొదటి ఆరు రోజులకు సరిలేరు నీకెవ్వరు చిత్రం 77.94 కోట్ల షేర్ ను వసూలు చేసిన విషయం తెల్సిందే. నాన్ హాలిడే అయినా కూడా 7వ రోజు 7.5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి సరిలేరు నీకెవ్వరు రెండు తెలుగు రాష్ట్రాల్లో 85 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను కూడా కలుపుకుంటే సరిలేరు నీకెవ్వరు 100 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుంది.

భరత్ అనే నేను, మహర్షి తర్వాత సరిలేరు నీకెవ్వరు ద్వారా మూడో సారి 100 కోట్ల క్లబ్ లో ప్రవేశించాడు మహేష్ బాబు. వరసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేసినట్లయింది.

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్:

నైజాం – 27.7 కోట్లు
సీడెడ్ – 12.4 కోట్లు
ఉత్తరాంధ్ర – 13.5 కోట్లు
గుంటూరు – 8.16 కోట్లు
ఈస్ట్ – 8.19 కోట్లు
వెస్ట్ – 5.61 కోట్లు
కృష్ణ – 6.87 కోట్లు
నెల్లూరు – 3.13 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ – 85.56 కోట్లు

వరల్డ్ వైడ్ గా ఇప్పటికే యూఎస్ లో ఈ చిత్రం 2 మిలియన్ మార్క్ కు చేరువైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే లాభాల్లోకి చేరిన ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో యూఎస్ లో కూడా బ్రేక్ ఈవెన్ కు రానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.