సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ బ్యాంగ్ అప్డేట్


Sarileru Neekevvaru interval bang episode completed
Sarileru Neekevvaru interval bang episode completed

ఏ చిత్రానికైనా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది అత్యంత కీలకమైంది. సెకండ్ హాఫ్ మొదలయ్యే వరకూ ప్రేక్షకులను ఒక రకమైన మూడ్ లో ఉంచడానికి ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఉపయోగపడుతుంది. తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందిట. ఈ ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల మైండ్ ను బ్లాక్ చేయడమే కాకుండా సెకండ్ హాఫ్ కు కొత్త యాంగిల్ ను సెట్ చేస్తుందిట.

ఇంత కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్ చిత్రీకరణ పూర్తైనట్లుగా తెలుస్తోంది. కొండారెడ్డి బురుజు సెంటర్ బ్యాక్ డ్రాప్ సెట్ లో ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. దీంతో ఈ షెడ్యూల్ పూర్తయింది. తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ఒక దేవాలయం బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలను రాబోయే షెడ్యూల్ లో చిత్రీకరిస్తారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహేష్, దిల్ రాజు సమర్పిస్తున్నారు.