సరిలేరు బడ్జెట్ మ్యాజిక్ ఫిగర్ దాటేసిందిగాసరిలేరు బడ్జెట్ మ్యాజిక్ ఫిగర్ దాటేసిందిగా
సరిలేరు బడ్జెట్ మ్యాజిక్ ఫిగర్ దాటేసిందిగా

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలవుతుందన్న విషయం తెల్సిందే. ఇంకా ఈ రిలీజ్ గురించి పూర్తి క్లారిటీ లేనప్పటికీ 11నే విడుదల అని అందరు డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర బడ్జెట్ గురించి ఇప్పటికే రకరకాల కథనాలు వెలువడ్డ సంగతి తెల్సిందే. దాని ప్రకారంగా సరిలేరు నీకెవ్వరు చిత్ర మేకింగ్ అయిన ఖర్చు 100 కోట్లు దాటేసినట్లు తెలుస్తోంది. 100 కోట్ల కలెక్షన్స్ వస్తే తెలుగు సినిమాల వరకూ అది ఒక మ్యాజిక్ ఫిగర్ కింద లెక్క. బాహుబలి 2, రంగస్థలం, సైరా నరసింహారెడ్డి, మహర్షి సినిమాలు తప్ప తెలుగులో ఇప్పటి వరకూ 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా లేదు. అలాంటిది ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి బడ్జెట్ 100 కోట్లు దాటేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. బడ్జెట్ 100 కోట్లు అంటే ప్రమోషన్స్ కు, రిలీజ్ ఖర్చులకు ఇలా బయట ఖర్చులు అన్నీ 120 వేసుకుంటే దాకా అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అదే రేంజ్ కు సినిమాను బిజినెస్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ స్థాయికి మించి కలెక్షన్స్ రాబట్టాలి. లేదంటే సినిమాను హిట్ అనలేం.

సరిలేరు నీకెవ్వరు ఇప్పుడు సంక్రాంతికి విడుదలవుతోంది. సంక్రాంతి సినిమాలకు మార్కెట్ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు వస్తున్నాయి. అందులోనూ ఒకరోజు గ్యాప్ లో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో విడుదలవుతోంది. బాక్స్ ఆఫీస్ పరంగా ఈ రెండు సినిమాలు ఢీ అంటే ఢీ అనడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో సరిలేరు నీకెవ్వరు 120 కోట్లకు మించి వసూళ్లు సాధించాలంటే తలకు మించిన భారమే. సినిమాపై ఎంత బజ్ ఉన్నా కానీ ఇది జరిగే పనిలా అనిపించదు. సినిమాకు ఇంతకీ అంత ఎందుకు అయింది అంటే రెమ్యునరేషన్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి ఇంతకు ముందు సినిమాలకు 3 నుండి 4 కోట్ల మధ్యన తీసుకునేవాడు. సరిలేరు నీకెవ్వరుకు మాత్రం రెమ్యునరేషన్ ను డబల్ చేసి 8 కోట్ల వరకూ పుచ్చుకుంటున్నాడు. ఇక మహేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ముందు పాతిక కోట్లు తీసుకునే మహేష్ బాబు తర్వాత లాభాల్లో వాటా కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ కానీ రాయించుకుంటాడు. అందుకే తన ప్రొడక్షన్ హౌస్ ను సినిమాల్లో భాగం చేస్తూ ఉంటాడు. ఇక విజయశాంతి కూడా తన రీ ఎంట్రీ సందర్భంగా భారీగా పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. కోటి దాకా ఆమెకు సమర్పించుకున్నారు. రష్మికకు కూడా దగ్గరగా కోటి అయిందని తెలుస్తోంది. ఇక ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ వంటి భారీ కాస్ట్ ఈ సినిమాలో భాగం.

అనిల్ రావిపూడి సినిమాలంటే కమెడియన్లు కూడా భారీ సంఖ్యలో ఉంటారు. ఇలా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరినీ కలుపుకుని దాదాపు 65 కోట్ల వరకూ అయిందిట. ప్రొడక్షన్ కాస్ట్ మరో 35 కోట్లు అయిందని చెబుతున్నారు. అలా ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను టచ్ చేసిందన్న మాట.