సరిలేరు నీకెవ్వరు.. సెకండ్ హాఫ్ లో వినోదానికి ఢోకా ఉండదట


sarileru neekevvaru second half to be major highlight
sarileru neekevvaru second half to be major highlight

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఎంటర్టైన్మెంట్ కు మారుపేరుగా నిలిచిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేష్ ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ గా కనిపించనున్న సంగతి తెల్సిందే.

దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కూడా కొండారెడ్డి బురుజు సెంటర్ సీన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లోనే స్పెషల్ సెట్ వేశారు.

ఇదంతా పక్కనపెడితే ఈ సినిమాలో వినోదం అదిరిపోతుందట. అందులోనూ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వినోదం పుష్కలంగా ఉంటుందట. ఇదే ఈ చిత్రంలో యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని అంటున్నారు. వినోదం కనుక వర్కౌట్ అయితే సరిలేరు నీకెవ్వరు మరో లెవెల్ కి వెళ్లడం ఖాయమట.