చరణ్ నెక్స్ట్ సినిమాను డిసైడ్ చేయనున్న సరిలేరు రిజల్ట్


చరణ్ నెక్స్ట్ సినిమాను డిసైడ్ చేయనున్న సరిలేరు రిజల్ట్
చరణ్ నెక్స్ట్ సినిమాను డిసైడ్ చేయనున్న సరిలేరు రిజల్ట్

ఒక్కోసారి అంతే. ఒక సినిమా సక్సెస్.. ఆ సినిమాతో సంబంధం లేని వ్యక్తుల తర్వాతి సినిమాలను కూడా డిసైడ్ చేస్తుంది. ఎఫ్ 2 చిత్ర విజయం మహర్షి తర్వాత మహేష్ చేయబోయే సినిమాను డిసైడ్ చేసినట్లు అన్నమాట. ఎఫ్ 2 రిలీజ్ కు ముందే అనిల్ రావిపూడి మహేష్ కు కథ వినిపించాడు. అయితే అప్పటికి సుకుమార్ సినిమా లైన్లో ఉండడంతో తనకోసం వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పాడు మహేష్. అయితే ఎఫ్ 2 సినిమా విజయంతో మహేష్ ఆలోచనల్లో మార్పు మొదలైంది. సుకుమార్ సినిమాను వద్దనుకుని ముందుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు. అలా రూపుదిద్దుకుందే సరిలేరు నీకెవ్వరు కథ. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు విజయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తర్వాతి సినిమాను డిసైడ్ చేయబోతోంది. అదెలాగంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న చరణ్, ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మార్చ్ తో రామ్ చరణ్ తన షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు. దీంతో తన తర్వాతి సినిమా షూటింగ్ ను సమ్మర్ కే మొదలుపెడదామనే ఆలోచనలో ఉన్నాడు.

ఇప్పటికే ఈ విషయం తెల్సిన పలువురు దర్శకులు చరణ్ కు లైన్స్ వినిపించారు. ఆ లిస్ట్ లో అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దర్శకుడు రాజమౌళి కాబట్టి ఆ సినిమా ఎలాగైనా హిట్ అవుతుంది, అయితే వినయ విధేయ రామతో మర్చిపోయే డిజాస్టర్ ను అందుకున్న చరణ్, సోలో హీరోగా మరో హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే రాజమౌళి సినిమా తర్వాత ఎంచుకోబోయే సినిమా విషయంలో అసలు తప్పటడుగు వేయకూడదు. చరణ్ కూడా మహేష్ లాగే సడెన్ నిర్ణయాలు తీసుకోవడంలో. ముందుంటాడు. ధృవ సినిమా చేయాలనుకోవడం కానీ సైరాకు సురేందర్ ను దర్శకుడిగా సెలక్ట్ చేయడం కానీ ఇలా తీసుకున్న నిర్ణయాలే. అందుకే సరిలేరు నీకెవ్వరు చిత్రం కనుక మంచి విజయం సాధిస్తే అనిల్ రావిపూడిపై చరణ్ కు నమ్మకం పెరుగుతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చరణ్ తో పనిచేసే అవకాశం అనిల్ కే రావొచ్చు. అదన్నమాట సంగతి.