సరిలేరు నీకెవ్వరు.. అసలేంటీ కాన్ఫిడెన్స్


సరిలేరు నీకెవ్వరు.. అసలేంటీ కాన్ఫిడెన్స్
సరిలేరు నీకెవ్వరు.. అసలేంటీ కాన్ఫిడెన్స్

మహేష్ బాబు కెరీర్ లో 26వ సినిమాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. మహేష్ బాబు తన ప్రతీ సినిమాకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ను ప్రదర్శిస్తాడు. అది మాములే. అయితే సరిలేరు కి మాత్రం ఒక పరిధి దాటి మరీ మోసేస్తున్నాడేమో అనిపిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు.

ఈసారి సంక్రాంతి మరింత మజాగా ఉండనుంది. ప్రతీ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం సాధారణమే. అయితే ఇలా ఒకేరోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలవడం చాలా అరుదు. ఒకరి మీద పంతంతో మరొకరు ఇలా ఒకేరోజు రిలీజ్ డేట్ లను ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే దీనివల్ల రెండు చిత్రాలూ నష్టపోతాయన్నది మాత్రం సత్యం. అందుకే రిలీజ్ టైంకి ముందు ఏదొక సినిమా రిలీజ్ డేట్ మార్చుకుంటుందని భావిస్తున్నారు.

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు… ఒక సినిమా రిలీజ్ డేట్ మార్చుకుంటే కచ్చితంగా అది తమకి భయపడే అని అంటారు మరో స్టార్ హీరో ఫ్యాన్స్. మమ్మల్ని చూసి భయపడి తోక ముడిచారు అని అంటారు. సరిగ్గా ఇప్పుడు సరిలేరు టీం దానికోసమే ట్రై చేస్తోంది. తమ సినిమాపై ఎనలేని కాన్ఫిడెన్స్ చూపించి అల వైకుంఠపురములో టీమ్ ను బెదరకొట్టాలని చూస్తోంది. అందుకే మహేష్ నుండి ఆ స్టేట్మెంట్ వచ్చింది. దర్శకుడు, నిర్మాత కూడా ఈ సినిమా చూసి నవ్వి నవ్వి మీ కడుపు చెక్కలవ్వడం ఖాయం అంటున్నారు. మరి అల వైకుంఠపురములో వీటికి బెదురుతుందా?