సర్కార్ గొడవలో రాజీపడ్డారు


Sarkar makers compromise with AIADMK leaders

విజయ్ నటించిన సర్కార్ చిత్రం మొదటినుండి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి కాగా సినిమా విడుదలయ్యాక కూడా పలు వివాదాలతో సతమతం అవుతోంది ఆ చిత్ర యూనిట్ అందుకే కాబోలు చేసేది లేక రాజీమార్గం దొరకడంతో రాజీపడ్డారు . ఇంతకీ విడుదల అయ్యాక గొడవ ఏంటి ? ఎందుకు రాజీ పడ్డారని అనుకుంటున్నారా ? సర్కార్ చిత్రంలో విజయ్ తో పాటుగా వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించిన విషయం తెలిసిందే . ఆమె పాత్ర పేరు కోమలవల్లి , అదే అన్నా డిఎం కే కార్యకర్తలకు , నాయకులకు నచ్చలేదు దాంతో కోమలవల్లి అనే పేరు తొలగించాలని గొడవ చేసారు దానికి చిత్ర బృందం కోమలవల్లి అనే పేరు ని మ్యుట్ చేయడానికి ఒప్పుకున్నారు .

ఇంతకీ కోమలవల్లి పేరు పట్ల అన్నాడి ఎం కే వాళ్ళకు కోమలవల్లి అనే పేరుకి సంబంధం ఏంటి ? అని అనుకుంటున్నారా ? దివంగత ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు కోమలవల్లి .అందుకే అభ్యంతరం చెప్పారు ఆమె పార్టీ వాళ్ళు . గొడవ ఇంకా పెద్దది చేయడం ఇష్టం లేక కోమలవల్లి అనే పేరు మ్యుట్ చేయడానికి ఒప్పుకున్నారు అలాగే కొన్ని సన్నివేశాల కత్తెరింపు కి కూడా ఒప్పుకున్నారు . ఇంకేముంది సర్కార్ గొడవ సమసిపోయినట్లే !

English Title: Sarkar makers compromise with AIADMK leaders