`స‌ర్కారు వారి పాట‌`కు కోవిడ్ దెబ్బ‌!

`స‌ర్కారు వారి పాట‌`కు కోవిడ్ దెబ్బ‌!
`స‌ర్కారు వారి పాట‌`కు కోవిడ్ దెబ్బ‌!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌ల దుబాయ్‌లో మొద‌లైంది. అక్క‌డ కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు.

మ‌రోసారి దుబాయ్ షెడ్యూల్ అనుకున్నారు. కొంత షూట్ కూడా చేశారు. ఆ త‌రువాత గోవాలో మ‌రో షెగ్యూల్‌ని ప్లాన్ చేశారు. అయితే ఆ షెడ్యూల్‌ని మేక‌ర్స్ క్యాన్సిల్ చేసిన‌ట్టు తెలిసింది. కార‌ణం దేశ వ్యాప్తంగా మ‌రోసారి క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండ‌ట‌మే. దీంతో టీమ్ గోవా షెడ్యూల్‌ని ర‌ద్దు చేసుకుంద‌ట‌. మ‌రెక్క‌డైనా షూట్ చేయాల‌ని అనుకున్న కోవిడ్ -19 కార‌ణంగా షూటింగ్ చేయాలేని ప‌రిస్థితి త‌లెత్త‌డంతో టీమ్ ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

షెడ్యూల్ ప్ర‌కారం ఈ మూవీ షూటింగ్‌ని సెప్టెంబ‌ర్ వ‌ర‌కు పూర్తి చేయాల‌న్న‌ది టార్గెట్. సంక్రాంతికి రిలీజ్ కావాలంటే ఆ టైమ్‌కి షూటింగ్ ఫినిష్ కావాల‌న్న‌ది టీమ్ పెట్టుకున్న టార్గెట్. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అది కుద‌ర‌క‌పోవ‌డంతో మేక‌ర్స్ ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది.