నెట్టింట వైర‌ల్‌గా మారిన మ‌హేష్ ఫొటో!

నెట్టింట వైర‌ల్‌గా మారిన మ‌హేష్ ఫొటో!
నెట్టింట వైర‌ల్‌గా మారిన మ‌హేష్ ఫొటో!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్నారు. ఇది ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్‌. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ దుబాయ్‌లో జ‌రుగుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని ప్ర‌స్తుతం దుబాయ్‌లో చిత్రీక‌రిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌హేష్‌బాబు త‌న అసిస్టెంట్‌తో వెళుతుండ‌గా ఓ వ్య‌క్తి ఎండ‌లో నేల‌పై కూర్చుని స్క్రిప్ట్‌కి సంబంధించి ఏదో రాస్తున్నారు. ఆ వ్య‌క్తి ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ అని నెట్టింట చ‌ర్చ న‌డుస్తోంది.

అదే నిజ‌మైతే అత‌ని హార్ద్ వ‌ర్క్‌కి, వృత‌త్తిప‌ట్ల అత‌నికున్న నిబ‌ద్ధ‌త‌కి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు. ఇదిలా వుంటే మ‌హేష్ ఇన్ స్టాలో దుబాయ్ షూటింగ్‌పై ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టారు. దుబాయ్‌లో షూటింగ్ అమేజింగ్ అని.. ఓ అద్భుత‌మైన ఎక్స్‌పీరియ‌న్స్ అన్నారు. దుబాయ్‌లోని @in5లో జ‌రిగింద‌ని, ప్ర‌తిభావంత‌మైన యువ వ్యాపార వేత్త‌లు త‌మ ఆలోచ‌న‌ల‌కు కార్య‌రూపం ఇవ్వ‌డం స్ఫూర్తినిస్తోంది. మా బృందానికి సాద‌ర స్వాగ‌తం ప‌లికిన @in5 బృందాన్ని అభినందిస్తున్నాను` అని పోస్ట్ పెట్టారు.