
స్టార్ హీరోలు ఈ మధ్య సొంతంగా రంగంలోకరి దిగుతున్నారు. తాము నటించే చిత్రాలకు వన్ ఆఫ్ ది పార్ట్నర్గా వుంటున్నారు. దీంతో లాభాల్లో వాటాలకు వాటా.. నిర్మాతలకు సాయాకి సాయంగా వుంటున్నారు. దీంతో భారీ ప్రాజెక్ట్‌లు అలవోకగా సెల్లవుతున్నాయి. లాభాల పంట పండిస్తున్నాయి. ఈ విషయంలో ముందు వరుసలో నిలుస్తున్న స్టార్ హీరో మహేష్‌బాబు.
`శ్రీమంతుడు` చిత్రం నుంచి మహేష్ ఈ పంథాని అనుసరిస్తున్నారు. దీని ద్వారా సినిమా ఏరియా హక్కులు, శాటిలైట్ రైట్స్ , అనువాద హక్కులు హీరో ఖాతాలో పడుతున్నాయి. దీంతో పారితోషికానికి మించి మహేష్‌కు భారీగానే ముడుతోంది. ఇదే లాభసాటి యాపారం కావడంతో మహేష్ ఇదే పంథాను `శ్రీమంతుడు` సినిమా నుంచి కొనసాగిస్తున్నాడు. తను నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`కు కూడా ఇదే ఫార్ములాని అప్లై చేశాడు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ సహా శాటిలైట్ రైట్స్ ని అమ్మేశారని, దీనికి 35 కోట్లు భారీ ఆఫర్‌ని ఓ ప్రముఖ సంస్థ ఇచ్చినట్టు తాజా సమాచారం. ఇక హిందీ అనువాద హక్కులు మాత్రమే మిగిలి వున్నాయట. షూటింగ్‌కి ముందే ఈ స్థాయిలో `సర్కారు వారి పాట` శాటిలైట్, డిజిటల్ హక్కులు అమ్ముడు పోవడం రికార్డుగా చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వాళ్లంతా మహేష్ జోరు మామూలుగా లేదుగా అంటూ అవాక్కవుతున్నారు.