సత్యా గ్యాంగ్ రివ్యూ


sathya gang movie review ratingసత్యా గ్యాంగ్ రివ్యూ
నటీనటులు: సాత్విక్ ఈశ్వర్ , అక్షిత , సుమన్ , సుహాసిని, కాలకేయ ప్రభాకర్ తదితరులు.
సంగీతం , దర్శకత్వం: ప్రభాస్
నిర్మాత : మహేష్ ఖన్నా
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 6 ఏప్రిల్ 2018

 

 

వ్యాపారవేత్త , రాజకీయ నాయకుడు అయిన మహేష్ ఖన్నా తనకు వచ్చిన ఆలోచన ని కథ గా మార్చి యువతకు , తల్లిదండ్రులకు చక్కని సందేశాన్ని ఇవ్వాలన్న సంకల్పం తో నిర్మించిన చిత్రమే సత్యా గ్యాంగ్. ప్రభాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా సాత్విక్ ఈశ్వర్ హీరోగా పరిచయం అయ్యాడు. మరి ఈ సత్యా గ్యాంగ్ ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

డోన్ పరిధిలో వరుస హత్యలు జరుగుతుండటంతో ఆ హత్యలను చేస్తున్న ముఠా అంతం చూడాలని పట్టుదలతో ఉంటాడు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సూర్య ( సుమన్). గ్యారేజ్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు అనాధలైన సత్యా గ్యాంగ్ . సత్యా గ్యాంగ్ లోని ధన్ రాజ్ ( సాత్విక్ ఈశ్వర్) అక్షిత ని చూసిన మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అక్షిత కూడా ధన్ రాజ్ ని ప్రేమిస్తుంది. హంతక ముఠా ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఏసీపీ సూర్య కు సత్యా గ్యాంగ్ లోని మనిషి పట్టుబడతాడు. అసలు డోన్ పరిధిలో హత్యలు చేస్తున్న ముఠా ఎవరు ? వాళ్లకు సత్యా గ్యాంగ్ కి సంబంధం ఏంటి ? చివరకు హంతక ముఠా ని ఏసీపీ పట్టుకున్నాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలైట్స్ :

కథ
చంద్ర బోస్ పాట

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

హోం మంత్రిగా నటించిన మహేష్ ఖన్నా మెయిన్ విలన్ పాత్రలో మెప్పించాడు అంతేకాదు ఐటమ్ సాంగ్ లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక హీరోగా నటించిన సాత్విక్ ఈశ్వర్ కొన్ని సన్నివేశాలలో తెలిపోయినప్పటికి బాగానే నటించాడు. అలాగే డ్యాన్స్ లతో కూడా అలరించాడు. మొదటి సినిమానే అయినప్పటికీ ఆ భయం కనిపించలేదు. ఇక పోలీస్ అధికారి పాత్రలో సుమన్ అదరగొట్టాడు. చాలాకాలం తర్వాత సుమన్ కు మంచి పాత్ర లభించింది. అలాగే సీనియర్ నటి సుహాసిని ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి మెప్పించింది. హీరోయిన్ గా అక్షిత నటన తోను గ్లామర్ తోనూ అలరించింది. కాలకేయ ప్రభాకర్ విలన్ , జీవా , హర్షిత , ప్రత్యూష్ తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం :

దర్శకత్వంతో పాటుగా సంగీతం కూడా అందించిన ప్రభాస్ పూర్తి స్థాయిలో రాణించలేక పోయాడు. మూడు పాటలు బాగున్నాయి ముఖ్యంగా చంద్రబోస్ రాసిన అనాథల పాటకు హృదయం ద్రవించేలా సంగీతం అందించాడు ప్రభాస్. మహేష్ ఖన్నా నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణతో పాటు ముఖ్య పాత్రలో రాణించాడు.

ఓవరాల్ గా :

ఈ దేశంలో అనాథ పిల్లలు అనే వాళ్ళు లేకుండా ఎలా చేయచ్చో , దానికి సొల్యూషన్ ఏంటో స్పష్టంగా చెప్పి చక్కని సందేశాన్ని ఇచ్చిన సత్యా గ్యాంగ్ చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు.


REVIEW OVERVIEW
sathya gang movie review
SHARE