రైజింగ్ విలన్ గా దూసుకుపోతోన్న శతృ


satru as raising villian of chinnababu movie

తెలుగు నటుడు శతృ కోలీవుడ్ లోబిజీ అవుతున్నాడు. అదీ మెయిన్ విలన్ గా. ఆకట్టుకునే రూపంతో పాటు కండలు తిరిగిన దేహంతో ఏ పాత్రైనా చేయగలడు అనిపించేలా కనిపించే నటుడు శతృ. కృష్ణగాడి వీర ప్రేమగాథలో హీరోయిన్ అన్నయ్యగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు శతృ. ఆ సినిమా తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన రంగస్థలం సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెప్పించాడు. పాత్ర ఎంత చిన్నదైనా తనదైన ముద్ర వేయగల ప్రతిభావంతమైన నటన చూపించడం శతృ శైలి. అందుకే చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా అందరు హీరోల సినిమాల్లోనూ అలరించే పాత్రలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శతృకు తమిళ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. అదీ మెయిన్ విలన్ గా..

తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించిన చినబాబులో మెయిన్ విలన్ శతృనే. ఈ 13న విడుదల కాబోతోన్న చినబాబు సినిమాతో విలన్ గా తనకు కొత్త టర్న్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. అలాగే ఈ సినిమాలో అతని పాత్రకు విడుదలకు ముందే కోలీవుడ్ నుంచి అద్బుతమైన ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం రైజింగ్ విలన్ గా పేరు తెచ్చుకున్న శతృ ఈ సినిమా తర్వాత స్టార్ విలన్ గా మారే అవకాశాలు ఉన్నాయని చాలామంది పెద్ద నటులు కూడా చెబుతున్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే చినబాబులో కార్తీతో సమానమైన ప్రాధాన్యం ఉన్న శతృది అంటున్నారు. అంటే సినిమా సక్సెస్ లో ఈ విలన్ దీ మెయిన్ రోల్ కాబోతోందనుకోవచ్చు.

తెలుగులో ఇప్పటి వరకూ మంచి పాత్రలే చేశాడు శతృ. కానీ ఖచ్చితమైన బ్రేక్ మాత్రం రాలేదింకా. చినబాబు తన కెరీర్ కు ఒకేసారి రెండు భాషల్లో బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా శతృ అటు కోలీవుడ్ తో పాటు ఇటు తెలుగులోనూ బిజీ అవుతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. తెలుగులో ప్రతిభావంతమైన విలన్ పాత్రలు కరవవుతోన్న టైమ్ లో రైజింగ్ విలన్ గా శతృ దూసుకుపోతున్నాడు.

English Title: satru as raising villian of chinnababu movie