అక్షయ్ సహాయాన్ని తప్పు పట్టిన సీనియర్ బాలీవుడ్ నటుడుఅక్షయ్ సహాయాన్ని తప్పు పట్టిన సీనియర్ బాలీవుడ్ నటుడు
అక్షయ్ సహాయాన్ని తప్పు పట్టిన సీనియర్ బాలీవుడ్ నటుడు

కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా లో, మిడిల్ క్లాస్ వర్గాలపై పడింది. ముఖ్యంగా రోజూవారి కూలికి వెళ్లే వారికి రోజు గడవడమే ఇబ్బందిగా మారింది. దీనిపై ఎప్పుడూ ముందుండి స్పందించే టాలీవుడ్ ఈసారి కూడా స్పందించింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ నుండి మొదలుకుని దాదాపు ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయాన్ని అందించారు. ఈ విషయంలో కోలీవుడ్ కూడా ముందుంది. అయితే వీరితో పోల్చుకుంటే దాదాపు రెండు, మూడింతలు పారితోషికం అందుకునే బాలీవుడ్ నటులు మాత్రం ఈ విషయంలో చడీచప్పుడూ లేకుండా ఉండిపోయారు. అయితే బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం స్పందించారు. ప్రధానమంత్రి సహాయనిధికి 25 కోట్ల విరాళాన్ని అందించాడు. దీంతో పాటు 3 కోట్లు ముంబై మున్సిపాలిటీకి అందించడం కొసమెరుపు.

అక్షయ్ కుమార్ రూట్ లోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తన వంతు సహాయం అందించాడు. సినీ కార్మికులకు తమ అకౌంట్ లోకే డైరెక్ట్ గా డబ్బులు జమయ్యే ఏర్పాట్లు చేసాడు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా ప్రజల సహాయార్థం స్పందించాడు. అయితే బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుజ్ఞ సిన్హా మాత్రం అక్షయ్ కుమార్ ను తప్పుపట్టడం విశేషం. డైరెక్ట్ గా అక్షయ్ కుమార్ పేరెత్తకుండా ఒక హీరో 25 కోట్ల విరాళాన్ని ప్రకటించడం తనకు షాక్ కు గురి చేసిందని ఈ నటుడు పేర్కొన్నాడు.

ఈ రకమైన పద్దతి ఏ మాత్రం మంచిది కాదని, దీన్ని షో ఆఫ్ గానే పరిగణించాలని ఆ నటుడు తెలిపాడు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్షయ్ కుమార్ చాలా పెద్ద మనసుతో అంత పెద్ద మొత్తం ప్రకటించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడని, దాన్ని కూడా తప్పుపడితే మానవత్వానికి మచ్చగా మిగులుతుందని, అక్షయ్ ను విమర్శిస్తున్న వారు ఈ కష్ట సమయంలో ఎదుటి వారికి ఎంత వరకూ సహాయం చేయగలిగారో చూసుకోవాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.