ఆ క్రేజ్ కు త‌మ‌న్నానే కార‌ణం : స‌త్య‌దేవ్‌


ఆ క్రేజ్ కు త‌మ‌న్నానే కార‌ణం : స‌త్య‌దేవ్‌
ఆ క్రేజ్ కు త‌మ‌న్నానే కార‌ణం : స‌త్య‌దేవ్‌

స‌త్య‌దేవ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `గుర్తుందా సీతాకాలం`. నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ నిర్మిస్తున్నారు. భావ‌న ర‌వి భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. హీరోయిన్‌లుగా మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మేఘా ఆకాష్‌, కావ్య‌శెట్టి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్త‌యింది. త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీపై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లో పాటు ఆడియ‌న్స్‌లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

టైటిల్‌, త‌మ‌న్నా, స‌త్య‌దేవ్‌ల కాంబినేష‌న్ కార‌ణంగా ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం తాజాగా హైద‌రారాబాద్‌లో ప్ర‌త్యేకంగా మీడియాతో ముచ్చ‌టించింది. స‌త్య‌దేవ్ మాట్లాడుతూ `ఈ సినిమాకు నేను హీరో అయిన‌ప్ప‌టికీ మిల్క్‌బ్యూటీ త‌మన్నా రియ‌ల్ హీరో. త‌న వ‌ల్లే ఈ మూవీకి క్రేజ్ పెరిగింది. త‌మ‌న్నాతో పాటు ఈ మూవీకి మేఘా ఆకాష్‌, కావ్యాశెట్టి ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచారు. ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ గారికి తెలుగు ఇండ‌స్ట్రీలోకి స్వాగ‌తం. తెలుగు ప్రేక్ష‌కులు గుర్తుందా సీతాకాలం చిత్రాన్ని త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను`అన్నారు.

లాక్‌డౌన్ టైమ్‌లో చాలా సినిమాలు చూశాను. ఎన్నో క‌థ‌లు విన్నాను. అయితే ఈ మూవీ గురించి చెప్ప‌గానే ఎందుకో ఇందులో న‌టించాల‌నిపించింది. రొమాంటిక్ డ్రామాల్లో నేను న‌టించి చాలా రోజులు అయ్యింది. `గుర్తుందా సీతాకాలం`తో మ‌రో ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీలో న‌టిస్తుండ‌టం చాలా ఆనందంగా వుంది. స‌త్య‌దేవ్ ఈ సినిమాకు ప‌ర్‌ఫెక్ట్ . ఈ మూవీతో ద‌ర్శ‌కుడు నాగ‌శేఖ‌ర్ మంచి పేరు తెచ్చుకుంటార‌నిపిస్తోంది`అని త‌మ‌న్నా తెలిపింది. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌క‌నిర్మాత నాగ‌శేఖ‌ర్,  ఆనంద్ ఆడియో అధినేత శ్యామ్‌, కాల‌భైర‌వ‌, ల‌క్ష్మీ భూపాల్‌‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.