క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న స‌త్య‌దేవ్‌!


క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న స‌త్య‌దేవ్‌!
క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న స‌త్య‌దేవ్‌!

విల‌క్ష‌ణమైన చిత్రాల హీరోగా స‌త్య‌దేవ్ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూనే ఆయ‌న డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ని కూడా వ‌ద‌లం లేదు. ఇటీవ‌ల వ‌రుస‌గా వెబ్ సిరీస్‌ల‌లో న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు కూడా. జ్యోతిల‌క్ష్మి, మ‌న ఊరి రామాయ‌ణం, బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, బ్రోచే వారెవ‌రురా, ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌, 47 డేస్ వంటి చిత్రాల‌తో పాటు గాడ్స్ ఆఫ్ ధ‌ర్మ‌పురి,  లాక్డ్‌ వంటి వెబ్ సిరీస్‌ల‌తో ఆక‌ట్టుకున్నారు.

తాజాగా త‌మ‌న్నాతో క‌లిసి `గుర్తుందా శీతాకాలం` అంటున్న స‌త్య‌దేవ్‌కు ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అభించింది. విజ‌య్ సేతుప‌తి త‌ర‌హాలో విల‌క్ష‌న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్న స‌త్య‌దేవ్‌కు తాజ‌గా ఓ త‌మిళ చిత్రంలో న‌టించే ఆఫ‌ర్ ల‌భించింది. కీర్తి సురేష్‌, ద‌ర్శ‌కుడు సెల్వ‌రాఘ‌వ‌న్ కీల‌క పాత్ర‌ల్లో `సానీ కాయిత‌మ్‌` పేరుతో అరుణ్ మాతేశ్వ‌ర‌న్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని మేక‌ర్స్ ఇటీవ‌లే విడుద‌ల చేశారు.

ఇందులోని ఓ కీల‌క పాత్ర కోసం చిత్ర వ‌ర్గాలు స‌త్య‌దేవ్‌ని ఇటీవ‌ల సంప్ర‌దించార‌ట‌. పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. 80వ ద‌శ‌కం నేప‌థ్యంలో ఈ చిత్ర‌ క‌థ సాగ‌నుంది. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్నివివ‌రాల్ని చిత్ర బృందం అధికారికంగా వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలిసింది.