రజనీ , కమల్ లపై నిప్పులు చెరిగిన కట్టప్ప

కట్టప్ప అలియాస్ సత్యరాజ్ తమిళ సూపర్ స్టార్ హీరోలైన రజనీకాంత్ పైన కమల్ హాసన్ లపైనా నిప్పులు చెరిగాడు . తమిళనాడులో ఏదో పొడుద్దామని రాజకీయాల్లోకి వచ్చారని కానీ వీళ్ళ వల్ల ఏమి కాదని సంచలన వ్యాఖ్యలు చేసాడు . ఇప్పటికే తమిళనాడులో రాజకీయంగా బలమైన పార్టీలు ఉన్నాయి ముఖ్యంగా డి ఎం కే పార్టీ వేళ్లూనుకుపోయి ఉంది అలాంటిది వీళ్ళు వచ్చి రాజకీయాలను మార్చుతాం అంటే సాధ్యమయ్యే పనికాదని తేల్చి పడేసాడు సత్యరాజ్ .

తమిళనాట రజనీకాంత్ , కమల్ హాసన్ లు స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న రోజుల్లో సత్యరాజ్ కూడా స్టార్ హీరోనే ! అయితే స్టార్ హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించాడు . అయితే ఇప్పుడేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యాడు కానీ రజనీకాంత్ , కమల్ హాసన్ లు ఇప్పటికి కూడా స్టార్ డం కొనసాగిస్తూనే ఉన్నారు . అయితే ఈ ఇద్దరు కూడా రాజకీయ పార్టీలను పెట్టిన విషయం తెలిసిందే . దాంతో కట్టప్ప అలియాస్ సత్యరాజ్ కు కోపం వచ్చింది . వీళ్ళ వల్ల తమిళ రాజకీయాలు ఏమి మారవు హాయిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది అంటూ ఇద్దరికీ కూడా ఉచిత సలహా ఇస్తున్నాడు . మరి ఈ విమర్శలపై రజనీకాంత్ , కమల్ హాసన్ లు ఎలా స్పందిస్తారో చూడాలి .