సవారి – 2020 లో మొదటి గేమ్ చేంజర్


Savaari Movie Game Challenge
Savaari Movie Game Challenge

దాదాపు సినిమాలు అన్నీ ఒక మీటర్ తీసుకుని అందులో నుండి క్రాస్ అవ్వకుండా కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ కొన్ని సినిమాలు అప్పుడప్పుడూ గీత దాటి, రూల్స్ బ్రేక్ చేసి, అన్నీ బాగుంటే హిట్టు కొట్టి, కొత్త లైన్స్ సెట్ చేస్తాయి. అలాంటి ఒక సినిమా గతంలో వచ్చిన రాజేంద్రుడు –గజేంద్రుడు. ఇప్పుడు మళ్ళీ యువ నటుడు నందు హీరోగా చేస్తున్న “సవారి”. సాధారణంగా మనం రాజుల కథలు చదివేటప్పుడు, గుర్రాల స్వారీ అనే పదం వింటూ ఉంటాం. అదే కొంచెం ప్రాంతీయ మాండలీకం కలిసి “సవారీ” అయ్యింది.

సవారీ ట్రైలర్ చూస్తుంటే, ఒక గుర్రం పేరు “బాద్ షా.” హీరో రాజు కి అదే ప్రాణం. అదే స్నేహితుడు. అదే ఉపాధి. అలంటి బాద్ షా కు ఆపరేషన్ కోసం మనోడు తిని, తినక డబ్బులు జమ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్. ఒక సమస్య. ఒక వైపు జీవితం. సరిగ్గా పీక్ టైం లో లవర్, బాద్ షా అతని జీవితం నుండి మాయం అయ్యే పరిస్థితి. అప్పుడు మన రాజు ఎలా గెలిచాడు.? అనేది కథ కావచ్చు. ముఖ్యంగా ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా “నీ కన్నులోన…” పాట అటు గుర్రానికి, ఇటు గర్ల్ ఫ్రెండ్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. దర్శకుడు సాహిత్ మోత్కూరి నిజంగా కథను నమ్ముకుని ఈ సినిమాను చేసిన విధానానికి ఆయనకు హ్యాట్సాఫ్. ఇక శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ అయ్యి, మంచి సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతాయని మరోసారి గట్టిగా ప్రూవ్ చెయ్యాలి.