నాగ్ కోసం మ‌రో బాలీవుడ్ హీరోయిన్‌!నాగ్ కోసం మ‌రో బాలీవుడ్ హీరోయిన్‌!
నాగ్ కోసం మ‌రో బాలీవుడ్ హీరోయిన్‌!

నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సోలోమ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలిసారి నాగార్జున ఎన్ ఐ ఏ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని 2009లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు.

ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ విజ‌య్‌వ‌ర్మ‌గా నాగార్జున ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.  మ‌న్మ‌థుడు 2` త‌రువాత సైలెంట్‌గా చిత్రీక‌ర‌ణ మొద‌లైన ఈ సినిమాలో నాగ్‌కు జోడీగా ఎవ‌రిని తీసుకోవాల‌నే చ‌ర్చ జ‌రిగింది. తాజాగా ఆ పాత్ర‌లో బాలీవుడ్ భామ దియా మీర్జాను ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లోనే దియా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటార‌ని తాజా న్యూస్‌.

ఇదిలా వుంటే ఇందులో మ‌రో బాలీవుడ్ భామ న‌టించ‌డానికి అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. 2015లో సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా పరిచ‌య‌మైన చిత్రం `రేయ్‌`. వైవీఎస్‌. చౌద‌రి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ సుంద‌రి స‌యామీఖేర్ హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. మ‌ళ్లీ ఇన్నేళ్ల విరామం త‌రువాత స‌యామీఖేర్ `వైల్డ్ లైఫ్‌` చిత్రం ద్వారా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఆమె రా ఏజెంట్‌గా క‌నిపిస్తార‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం.