‘సెబాస్టియన్ పి. సి . 524’ ఫస్ట్ లుక్ రిలీజ్


'సెబాస్టియన్ పి. సి . 524' ఫస్ట్ లుక్ రిలీజ్
‘సెబాస్టియన్ పి. సి . 524’ ఫస్ట్ లుక్ రిలీజ్

రాజా వారు రాణిగారు‘ వంటి భిన్నమైన ప్రేమకథా చిత్రంతో హీరోగా పరిచయమైయ్యారు కిరణ్ సబ్బవరం’. తొలిచిత్రంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కిరణ్ సబ్బవరం ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఎస్ ఆర్. కల్యాణమండపం, Est. 1975 చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో వున్నాయి.

ఇదిలా ఉండగా కిరణ్ సబ్బవరం తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించారు. ‘Est. 1975′ చిత్రాన్ని నిర్మిస్తున్న ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తాజాగా కిరణ్ అబ్బవరంతో సెబాస్టియన్ పి. సి . 524’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రమోద్, రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఫిస్ట్ లుక్ పోస్టర్ని స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంలో కిరణ్చి సబ్బవరం పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తున్నారు ఇదే థీమ్ తో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సినిమాలో హీరో రేచీకటితో బాధపడే యువకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ విప్లవ్, సినిమాటోగ్రఫీ రాజ్ కె నల్లి.  ఈ చిత్రానికి ‌సంబందించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారట.