సింగర్ సునీత రెండో పెళ్లికి సిద్ధమా ?


 second marriage rumours on singer sunitha

సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్ లో. నేపథ్య గాయని గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా , నటిగా విశేష ప్రాచుర్యం పొందింది సింగర్ సునీత. అయితే తక్కువ వయసులోనే పెళ్లి చేసుకొని సంసారం జీవితంలో అడుగుపెట్టిన సునీత కు ఇద్దరు సంతానం .ఇద్దరిలో ఒకరు అబ్బాయి కాగా మరొకరు అమ్మాయి. అయితే సంసారం జీవితం సాఫీగా సాగలేదు దాంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు రావడంతో చాలాకాలంగా భర్త తో దూరంగా ఉంటోంది సునీత . విడాకుల కోసం పెద్ద యుద్ధమే జరిగింది, విడిపోయి దూరంగా ఉంటున్నప్పటికీ విడాకులు తీసుకునే క్రమంలో ఇద్దరూ ఆరోపణలు చేసుకుంటూ అప్పట్లో మీడియాకు మంచి మసాలా ఇచ్చారు.

కట్ చేస్తే …. పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత సునీత కు పెళ్లి మీద గాలి మల్లడం అంటే విశేషమే మరి . అయితే అప్పట్లో మాత్రం రెండో పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది సునీత . కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సునీత రెండో పెళ్లి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అప్రతిహతంగా విజయాలు అందుకున్న సునీత వ్యక్తిగత జీవితం లో మాత్రం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించలేకపోయింది. ఈ రెండో పెళ్లి ముచ్చట నిజమా ? కాదా ? అన్నది తెలియాలంటే సునీత నోరు విప్పాల్సిందే.

English Title:  second marriage rumours on singer sunitha