ఆమె దగ్గర పెన్ డ్రైవ్ లో రహస్యాలు ఉన్నాయట


secrets in poonam pen driveఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న భామ పూనమ్ కౌర్ . కాగా ఆమెని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఫారసు చేసాడని అందుకే ఆమెని బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు ప్రభుత్వం నియమించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వానికి విలన్ గా మారాడు అలాగే పూనమ్ కౌర్ కూడా పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా లేదు దాంతో ఆమె దగ్గర ఉన్న రహస్యాల కోసం తెలుగుదేశం పార్టీ సన్నిహితులు ఆమెకు లాభం చేకూర్చే పనులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది .

ఇంతకీ ఆమె దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ఏంటి ? అందులో ఏ రహస్యాలు ఉన్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . ఎలాగైనా సరే పవన్ కు దిమ్మతిరిగేలా షాక్ ఇవ్వడానికి పూనమ్ కౌర్ దగ్గర ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు . ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది కానీ రాజకీయ క్రీడ అప్పుడే మొదలయ్యింది రెండు తెలుగు రాష్ట్రాలలో .