శర్వా హీరోయిన్ కెరీర్ ను ఆ మూవీ మార్చేస్తుందట


శర్వా హీరోయిన్ కెరీర్ ను ఆ మూవీ మార్చేస్తుందిట
శర్వా హీరోయిన్ కెరీర్ ను ఆ మూవీ మార్చేస్తుందిట

శర్వానంద్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా రన్ రాజా రన్ తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సీరత్ కపూర్. మొదటి చిత్రంతోనే మంచి మార్కులు వేయించుకుంది. తన నటనతో మెప్పించింది. దీంతో తెలుగులో అమ్మడికి అవకాశాలు బానే వచ్చాయి. ఆ తర్వాత టైగర్ చిత్రంలో నటించింది. అటుపై కొలంబస్ చేసింది. ఈ రెండు సినిమాలూ పరాజయం పాలవ్వడంతో అమ్మడికి హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. అయితే గ్లామర్ వైపు సీరత్ కపూర్ చూపు ఉండడంతో ప్రత్యేక పాత్రలు, సెకండ్ హీరోయిన్ రోల్స్ లో సీరత్ ను కన్సిడర్ చేయడం మొదలుపెట్టారు.

ఆ నేపథ్యంలోనే రాజు గారి గది 2, ఒక్క క్షణం వంటి సినిమాల్లో నటించింది. మాస్ మహారాజా సరసన టచ్ చేసి చూడులో కూడా అవకాశం వచ్చింది. అయితే ఇవేవీ సీరత్ కెరీర్ ను మార్చలేకపోయాయి. రీసెంట్ గా డైరెక్ట్ ఓటిటిలో విడుదలైన కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. ఆమె పాత్రకు, నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం సీరత్ మా వింత గాథ వినుమా అనే చిన్న చిత్రంలో నటిస్తోంది. అవ్వడానికి చిన్న చిత్రమే అయినా తన నటనకు చాలా స్కోప్ ఉందిట. ఇందులో తమిళ అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, తన కెరీర్ ను మార్చేసే చిత్రమిది అవుతుందని చెబుతోంది సీరత్ కపూర్. చూడాలి మరి నిజంగానే ఏ సినిమా ఆ రేంజ్ ను సక్సెస్ ను సాధించి సీరత్ కెరీర్ కు హెల్ప్ అవుతుందేమో.