`ఫిదా`లో చేయ‌మంటే ఆ ఇద్ద‌రు కాద‌న్నారా?

`ఫిదా`లో చేయ‌మంటే ఆ ఇద్ద‌రు కాద‌న్నారా?
`ఫిదా`లో చేయ‌మంటే ఆ ఇద్ద‌రు కాద‌న్నారా?

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల క్రియేట్ చేసిన ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీ `ఫిదా`. ఈ మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సాయి ప‌ల్ల‌వి లాంటి వండ‌ర్ ఫుల్ న‌టిని ప‌రిచ‌యం చేశారు. ఇదే సినిమాతో దాదాపు వంద కోట్ల క్ల‌బ్‌లో చేరారు. సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని అందుతున్నారు. వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టించిన ఈ చిత్రం అత‌ని కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా నిలిచింది.

అయితే ముందు ఈ క‌థ‌ని శేఖ‌ర్ క‌మ్ముల మ‌రో ఇద్ద‌రు స్టార్ హీరోల‌కు వినిపించార‌ట‌. ఆ ఇద్ద‌రు స్టార్ హీరోలు మ‌రెవ‌రో కాదు. మ‌హేష్‌బాబు, రామ్‌చ‌ర‌ణ్‌. ఈ ఇద్ద‌రు హీరోల‌కి `ఫిదా` స్టోరీ న‌చ్చ‌లేద‌ట‌. దీంతో ఈ క‌థ‌ని వ‌రుణ్‌తేజ్‌తో తెర‌కెక్కించార‌ట‌. ఆ త‌రువాత ఈ మూవీ ఏ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. తాజాగా ఈ విష‌యాన్ని ఓ టీవీ షోలో ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల వెల్ల‌డించారు. అంతే కాకుండా `ఆనంద్‌` సినిమా టైమ్‌లో త‌ను ఎదుర్కొన్న అవ‌మానాల‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

అదే స‌మ‌యంలో చిరంజీవి న‌టించిన `శంక‌ర్ దాదా` విడుద‌లైంద‌ని, అంత‌కు ముందే తాను థియేట‌ర్ల వారికి డ‌బ్బులు క‌ట్టేశానని, దాంతో ఏం చేయాలో అర్థం కాలేద‌ని, చాలా మంది పెద్ద వాళ్లు కూడా `ఆనంద్‌` థియేట‌ర్‌కి వ‌చ్చి `శంక‌ర్ దాదా` సినిమాకి వెళ్లిపోయార‌ని, విజ‌య‌వాడ ప్రింట్ తీసుకెళ్లాల‌ని డ్రైవ‌ర్ కోసం చూస్తుంటే `ఇదేంటి సార్ అంతా `శంక‌ర్‌దాదా` కోసం చూస్తుంటే మీరు ఈ సినిమా అంటారు`అన్నాడు. అంటే బాక్స్ తీసుకెళ్ల‌డానికి కూడా ఎవ‌రూ ఆస‌క్తిని చూపించ‌లేదు. అని `ఆనంద్` నాటి సంగ‌తుల్ని పంచుకున్నారు. శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న చిత్రం‌రం `ల‌వ్‌స్టోరీ`. నాగాచైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుద‌ల కాబోతోంది.